సైరా సినిమాలో తమిళ స్టార్ అరవింద్ స్వామి నటిస్తున్నాడా..? ముందు కొడుకు రామ్ చరణ్ సినిమా దృవలో నటించి అదరగొట్టాడు..ఇప్పుడు చిరంజీవి సైరా సినిమాలో మరోసారి నటించి అదరగొట్టనున్నాడా..? అంటే అవును అనే అంటున్నాయి సినీ వర్గాలు. సైరా కోసం అరవింద్ స్వామి తానే స్వయంగా రామ్ చరణ్ ను కోరి సినిమాలో ఛాన్స్ అడిగారాట.. మరి సినిమాలో నటించడానికి తానే ఫోన్ చేశాడంటే ఆ పాత్ర తనకి అంతగా ఇష్టమా..? ఆ పాత్ర అంతా ప్రత్యేకమా..? అనే ప్రశ్నలు కూడా ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి.
అసలు విషయానికొస్తే.. మెగా పవర్ స్టార్ నటించిన దృవ సినిమాలో అరవింద్ స్వామి ప్రతి నాయకుడిగా నటించి మంచి విలన్ గా గుర్తింపు పొందారు. ఆ సినిమాని డైరెక్ట్ చేసింది దర్శకుడు సురేందర్ రెడ్డి. ఇక ప్రస్తుతం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సైరా సినిమాని కూడా ఆయనే డైరెక్ట్ చేస్తున్నాడు. కాగా ఈ సినిమాకి రామ్ చరణ్ నిర్మాత. రామ్ చరణ్ సురేందర్ రెడ్డి లతో అరవింద్ స్వామికి దృవ చేస్తున్న సమయంలో మంచి మిత్రుత్వం ఏర్పడింది. ఇప్పుడు సైరా సినిమా అనేక భాషల్లో డబ్ చేస్తున్నారు. ఇందుకుగాను తమిళం డబ్ చేస్తున్న సైరా సినిమాలో ఛాన్స్ కోసం అరవింద్ స్వామి రామ్ చరణ్ కి ఫోన్ చేశారట.
ఫోన్ చేసింది సినిమాలో పాత్ర చేయడానికి కాదు.. చిరు కి తమిళం లో డబ్ చెప్పడానికి. మంచి చారిత్రిక విలువలు కలిగిన ఇలాంటి సినిమాలో డబ్ చేసిన చాలు అని భావిస్తున్నాడు అరవింద్ స్వామి. ఇందుకోరకు అరవింద్ స్వామి రామ్ చరణ్ కి ఫోన్ చేయడం తనని ఈ విషయం గురించి అడగటం వెంటనే కొన్ని తమిళ డైలాగ్ లు కూడా రామ్ చరణ్ కి చెప్పి తనని మెప్పించాడట. అంతేకాకుండా చిరంజీవికి కొన్ని డైలాగ్ లు రికార్డ్ చేసి వాట్సాప్ లో పంపాడట ఇక ఈ డైలాగ్ లు తన గొంతు చిరుకి నచ్చడంతో ఆయనకి ఈ ఆఫర్ ఇచ్చేశారు. చిరు నటనకి అరవింద్ స్వామి గొంతు బలే మ్యాచ్ అయ్యిందని అవుట్ పుట్ అద్భుతంగా వచ్చిందని సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.