బన్నీ సినిమా లీక్ అయ్యింది..! ఇదే కథ..! హిట్టు పక్కా..!

Google+ Pinterest LinkedIn Tumblr +

“కథ లీక్ అయితే హిట్టు పక్కా.. సినిమా బ్లాక్ బస్టర్” అనేది తెలుగు సీమాల్లో ఎప్పటినుండో ఉన్న ఒక ట్రెండ్..! నిజానికి కూడా కథ రిలీజ్ కి ముందుగానే లీక్ అయినా సినిమా ముందుగానే లీక్ అయినా సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి..! ముందుగా సినిమా లీక్ అయిన అత్తరింటికి దారేది సినిమా అద్భుతంగా హిట్ అయ్యింది. ట్యాక్సీవాలా సినిమా కూడా రిలీజ్ కి ముందే లీక్ అయినప్పటికీ ఆ సినిమా కూడా విజయ్ దేవరకొండ కి మంచి హిట్ ని అందించింది. ఇక ఇలాంటి నేపథ్యంలోనే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్-స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ లు తెరకెక్కిస్తున్న అలా వైకుంఠపురం స్నిమా కథ కూడా లీక్ అయ్యింది. మరి ఆ సినిమాల లాగానే ఇది కూడా హిట్ అవుతుందా..? అసలు లీక్ అయిన కథ సినిమా లోనిదేనా అనే ప్రశ్నలు ఇప్పుడూ అంతటా మొదలయ్యాయి.

లీక్ అయిన కథ ఆదారంగా.. అలా వైకుంఠపురం అనేది జయరాం అని ఒక ధనవంతుడి ఇంటికి పెట్టుకున్న పేరు.. ఆ ఇంట్లో రెండు కుటుంబాలు ఉంటాయి ఒకటి యజమాని కుటుంబం మరొకటి యజమాని డ్రైవర్ కుటుంబం..! యజమాని పేరు జయరాం, డ్రైవర్ పేరు మురళి శర్మ. ఇద్దరూ చాలా సాన్నిహిత్యంగా ఉంటారు. ఇద్దరికీ ఒకేసారి పిల్లలు పుడతారు. ఇద్దరికీ కొడుకులే పుడతారు..ధనవంతుడికి అల్లు అర్జున్ పుడతాడు, డ్రైవర్ కి సుశాంత్ పుడతాడు.

పిల్లలు పుట్టిన రోజున మురళి శర్మ, జయరాం లు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా.. పిల్లల భవిష్యత్తు గురించి చర్చ వస్తుంది. మురళి శర్మా మాట్లాడుతూ ధనవంతుడి కొడుకు ధనవంతుడే అవుతాడు..డ్రైవర్ కొడుకు డ్రైవరే అవుతాడు..! అని అంటాడు. దీనికి ఒప్పుకొని యజమాని పిల్లలని మార్చుకుందాము..! అప్పుడు తేలుతుంది కదా అని పిల్లలని మార్చుకోడానికి ఒప్పందం కుదుర్చుకుంటారు. అలా అల్లు అర్జున్ డ్రైవర్ కొడుకు గా సుశాంత్ ధనవంతుడి కొడుకు గా పెరుగుతారు.

మధ్యలో విలన్ గా నవదీప్ ఎంటర్ అవుతాడు. వీరి ముగ్గురు మధ్య కీలక సన్నివేశాలు జరుగుతాయని. ముగ్గురు చుట్టూ కథ తిరుగుతూ నిజం బయట పడుతుంది. దీంతో కథలో కొత్త ట్విస్ట్ లు మొదలవుతాయి. నిజం తెలుసుకున్న సుశాంత్ తిరిగి తన డ్రైవర్ తండ్రితో జీవించడానికి ఒప్పుకుంటాడట..! కానీ బున్ని మాత్రం ఇందుకు నిరాకరిస్తాడట..! ఫ్యామిలీ సన్నివేశాలతో ఎమోషన్స్ తో కథ సమాప్తం అవుతుందట. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా కామెడీ టచ్ తో ట్విస్ట్లతో సినిమా ఉండబోతునట్టు సమాచారం. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియా లో చాలా వైరల్ అవుతుంది.. సినిమా పనులు వేగంగా పూర్తవుతున్నాయి. ఇక సినిమా 2020 సంక్రాంతి కల్లా ప్రేక్షకుల ముందుకి వస్తుందని తెలుస్తుంది.

Share.

Comments are closed.

%d bloggers like this: