Advertisements

ఉండిపోరాదే: ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే లవ్ ఎంటర్ టైనర్

Google+ Pinterest LinkedIn Tumblr +

గోల్డ్ టైమ్ ఇన్ పిక్చ‌ర్స్ ప‌తాకంపై కొత్త నటీనటులు త‌రుణ్ తేజ్‌, లావ‌ణ్య హీరోహీరోయిన్లుగా న‌వీన్ నాయ‌ని ద‌ర్శ‌క‌త్వంలో డా.లింగేశ్వ‌ర్ నిర్మించిన సినిమా `ఉండిపోరాదే`. రొమాంటిక్ మరియు ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుందో తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
కథ :
పచ్చనైన అందాలతో కనువిందు చేసే ప్రకృతి ప్రేమ అందించే ఆహ్లాదకరమైన గోదావరి జిల్లాల్లోని రాజమండ్రి ప్రాంతానికి చెందిన ఒక గ్రామంలోని వ్యక్తి కేదార్ శంకర్.. తన కూతురు హర్షిత(లావణ్య) ను చిన్నప్పటి నుంచి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. పెద్ద చదువులు చదివించేందుకు హైదరాబాద్ కు పంపుతారు. హర్షిత చదివే చోటే కరీంనగర్ కు చెందిన ఒక పేద కుటుంబానికి చెందిన కుర్రాడు హీరో రామ్(తరుణ్ తేజ్) కూడా చేరుతాడు. ఈ ఇద్దరు ఒకే కాలేజీలో చేరి ప్రేమలో పడతారు. తెలిసీ తెలియని వయసులో వీరిద్దరి మధ్య చిగురించిన ప్రేమ చివరకు సక్సెస్ అయ్యిందా? వీరిద్దరూ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు? ఇంట్లో వాళ్లు వాళ్ల ప్రేమను ఒప్పుకున్నారా? ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సినిమాకు వెళ్లాల్సిందే.

విశ్లేషణ:
తెలుగు సినిమా ప్రేక్షకులు ఇటీవల వస్తున్న కొత్త తరహా సినిమాలను తక్కువ బడ్జెట్ సినిమాలైనా మెచ్చుతున్నారు. సినిమాలో ఎమోషన్ బాగా వర్క్ అవుట్ అయ్యింది. తండ్రి కూతుర్ల మధ్య నడిచే ప్రతీ సన్నివేశం ఆకట్టుకునే విధంగా ఉంటుంది. తండ్రీ కూతుర్ల మధ్య ఉండే బంధాల గురించి చెప్పే సన్నివేశాలు మనస్సుకు హత్తుకుంటాయి. ఈ సినిమాలోని ముఖ్యమైన ప్లస్ పాయింట్ ఎమోషనల్ కనెక్టివిటీ సినిమాలో అవే బాగా వర్క్ అవుట్ అయ్యాయి. హీరోయిన్ క్యూట్ లుక్స్ తో పాటు మంచి నటనను కనబరిచింది. కొత్త హీరోహీరోయిన్లు అయినా కూడా లావణ్య, తరుణ్ తేజ్ లు నటన చాలా బాగుంది. వాళ్ల మధ్య నడిచే లవ్ ట్రాక్ బాగా కుదిరింది. కేదార్ శంకర్ అద్భుత నటన సినిమాకు బాగా కలిసి వచ్చింది.
ఫస్టాఫ్ లో సన్నివేశాలు బాగున్నాయి. “పటాస్” ఫేమ్ నూకరాజు సహా అక్కడక్కడా వచ్చే కామెడీ సన్నివేశాలు మెప్పిస్తాయి. ఈ సినిమాలోని మరో సీనియర్ నటుడు అజయ్ ఘోష్ తన పాత్ర పరిధి మేరకు మంచి నటన కనబర్చారు. తెలిసీతెలియని ఏజ్ లో పిల్లలు ప్రేమలో పడితే వారి తల్లితండ్రులు పడే బాధలు ఎలా ఉంటాయి. సమాజంలో వారు ఎదుర్కొనే ఇబ్బందులేంటి? అనే విషయాలను దర్శకుడు చక్కగా ఎలివేట్ చేశారు. కాకపోతే సినిమా కాస్త లెంగ్తీగా అనిపిస్తుంది. తెలిసిన లవ్ ట్రాక్ కావడంతో కొత్తగా అనిపించదు. కానీ అందరికీ దగ్గరగా అనిపిస్తుంది.

సాంకేతిక విభాగం :
ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం నవీన్ నాయని అందించగా లింగేశ్వర్ కథను అందించారు. లింగేశ్వర్ అందించిన కథ పరంగా ఎమోషనల్ టచ్ ఉన్నప్పటికీ కొత్తదనం కథలో లేకపోవడంతో కాస్త ఇబ్బంది పడింది. కొత్తగా కొన్ని మార్పులు చేర్పులు చేసి సినిమాను తెరకెక్కించి ఉంటే బాగుండేది. సాబు వర్గేశ్ అందించిన సంగీతం పర్వాలేదు. యాలేందర్ అందించిన నేపథ్య సంగీతం మాత్రం ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

హైలైట్స్:
నటీనటుల నటన
కథ, కథనం
దర్శకత్వం
సినిమాటోగ్రఫీ
నేపధ్య సంగీతం

ఓవరాల్ గా లవ్ మరియు ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఉండిపోరాదే ఎమోషనల్ గా కూడా ప్రతీ ఒక్కరినీ కనెక్ట్ అవుతుంది.

Advertisements
Share.

Comments are closed.

%d bloggers like this: