శబాష్ కేటీఆర్..అనిపించుకున్నాడు..! మరోసారి పదవి దక్కించుకున్నాడు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలంగాణ రాష్ట్రంలో ఆయన ఇప్పటి వరకు అనేకమైన మినిస్ట్రీలు చేపట్టారు. చేపట్టిన ప్రతీ పదవికి సంపూర్ణంగా న్యాయం చేశారు కేటీఆర్. తండ్రికి తగ్గ కొడుకుగా పేరు తెచ్చుకున్నారు. ఐటీ శాఖా మంత్రిగా పని చేసి హైదరబాద్ కి అనేక ఐటీ కంపెనీలని తీసుకొచ్చి నిరుద్యోగ సమస్యని కొంత వరకు కట్టిపెట్టారు. ఐటీ రంగంలో హైదారాబాద్ ని ఎంతో ఎత్తుకి తీసుకెళ్లారు కేటీఆర్. గూగుల్ మైక్రోసాఫ్ట్ యాపిల్ లాంటి కంపెనీలని హైదరబాద్ కి తెచ్చిన ఘనత కేటీఆర్ కె చెందుతుంది. పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా పని చేసి పంచాయితీ వ్యవస్థలో పూర్తి క్రమశిక్షణని తీసుకొచ్చారు.

కేసీఆర్ కొడుకుగానే కాకుండా ఒక మంచి డైనమిక్ లీడర్ గా గుర్తింపు పొందారు. తెలంగాణ ఉద్యమానికి ముందు అమెరికాకి చదువుల నిమిత్తం వెళ్ళిన కేటీఆర్ అక్కడ చదువు పూర్తి చేసుకొని ఉన్నత స్థాయి ఉద్యోగాలు చేశాడు. ఉద్యమానికి తన వంతు కృషి చేయాలని భావించి తన తండ్రికి రాష్ట్రానికి తన సహాయం అవసరం అని తలచి అక్కడ నుండి తిరిగి రాష్ట్రానికి వచ్చాడు. అప్పటి నుండి పార్టీకి పార్టీ ఎదుగుదలకి రాష్ట్రం అభివృద్ధికి ఆయన ఎంతగానో కృషి చేశారు. మొదటి సారిగా ఆయన ఐటీ మున్సిపల్ శాఖాలకి మంత్రిగా పని చేసి శబాష్ అనిపించుకున్నారు ఇక మరోసారి ఆ శాఖలు ఆయననే వరించనున్నాయని వార్తలు వస్తున్నాయి.

Share.

Comments are closed.

%d bloggers like this: