కార్ ఎక్కారు..! పదవి కొట్టారు..! కేసీఆర్ కేబినెట్ లో సబిత..!

Google+ Pinterest LinkedIn Tumblr +

భర్త ఇంద్రా రెడ్డి మృతి తో పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అవకాశం దొరికిన మొదటిసారి భారీ మెజారిటీ తో గెలిచారు. అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రశంసలు పొందారు..! ఆమె పని తీరుతో ఆయన మనసు గెలుచుకున్నారు మంత్రి పదవి దక్కించుకున్నారు తానే మాజీ మంత్రి ఇంద్రా రెడ్డి భార్య.. సబితా ఇంద్రా రెడ్డి..! కీలక హోమ్ శాఖా పదవి లో పని చేసి శబాష్ అనిపించుకున్నారు. ఎందరో మహిళలకి రాజకీయం పట్ల అవగాహన కల్పించి అవకాశం కల్పించడం లో కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్ పార్టీలో ఎంతో కాలం పని చేసి తాజాగా ఎన్నకాల తరువాత టీఆర్ఎస్ లోకి వచ్చారు.

సబితా ఇంద్రా రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వం లోకి వచ్చేందుకు కమిట్ మెంట్ తీసుకున్నారు.. తనకి మంత్రి పదవి తప్పకుండా దక్కుతుంది అనే కమిట్ మెంట్ కేసీఆర్ ఇచ్చారని రాజకీయంగా చర్చలు కూడా జరిగాయి. మాట ఇచ్చిన ప్రకారంగానే ఈసారి జరుగుతున్న కేబినెట్ విస్తీరణలో ఆమె పేరుని నమోదు చేశారు. గతంలో చేవెళ్ల నుంచి గెలుపొందిన సబితా ప్రస్తుతం మహేశ్వరంకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: