పార్టీకి నమ్మిన బంటు..! గంగులకి కేసీఆర్ మంచి పదవి గిఫ్టు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

గత కొన్ని రోజులుగా మంత్రి ఈటెల రాజేందర్ అటు రాజకీయంగా ఇటు సామాజికంగా వార్తల్లో నిలుస్తున్నారు. ఈటెల రాజేందర్ చేసిన కొన్ని వ్యాఖ్యలు దుమారాన్ని రేపడమే ఇందుకు కారణం. ఆయన తెలంగాణ ప్రభుత్వం పై సీఎం కేసీఆర్ పై వ్యాఖ్యలు చేయడంతో ప్రభుత్వానికి ఆయనకి మధ్య పరిస్థితులు అతలాకుతలంగా మారాయి. నాకు పదవి ఎవ్వరూ పెట్టిన బిక్ష కాదని ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వానికి అంతగా నచ్చక ఇప్పుడు ఆయనని కేబినెట్ నుండి వేరు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది అనే వార్తలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రభుత్వం కూడా ఈ వార్తాలకి ఎక్కడా తగ్గకుండా నిజంగానే ఆయనని దూరం చేయాలని చూస్తుంది. ఇందుకు ప్రతీకాష్టగా కేబినెట్ విస్తీరణలో ఆయనకి చోటు దక్కలేదు. ఆయనని దూరం చేసి ఆయన స్థానంలో పార్టీకీ ఎప్పటినుండో బంటుగా ఉంటున్న గంగుల కమలాకర్ ని ఎంచుకుంది. గంగుల కమలాకర్ కరీం నగర్ జిల్లాకి చెందిన వాడు. కరీం నగర్ నుండి ఆయన రెడ్ను సార్లు శాసన సభకి ఎన్నికయ్యారు. గంగుల కేటీఆర్ కి మంచి సన్నిహితుడిగా అనుచరుడుగా పేరు పొందారు. ఇక ఈసారి అదృష్టం ఆయనని వరించింది..! కేసీఆర్ కేబినెట్ లో చోటు దక్కింది.

Share.

Comments are closed.

%d bloggers like this: