టీడీపీ నేత మాజీ విప్ చైర్మెన్ బుద్ధా వెంకన్న తరచూ మీడియా ముందుకి వచ్చి తన వ్యాఖ్యలతో విమర్శలతో హల్ చల్ చేస్తూ ఉంటాడు. ప్రభుత్వంలో ఉన్న జగన్ పై ఆయన పాలన పై విమర్శలు చేయడం ఈయన వైనం. జగన్ ప్రభుత్వం లో ఏ చిన్న లోపం కనిపించినా చాలు బుద్ధా ఇట్టే పసిగట్టి మీడియా ముందు వాలిపోతూ ఉంటాడు. ఎన్నికల ముందు టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు బుద్ధా నోటికి హద్దే ఉండేది కాదు..! వైసీపీ నేతలనీ ఏకీ పారేసేవాడు. ఇక ప్రభుత్వం తమ చేతుల్లోంచి వెళ్లిపోయేసరికి బుద్ధా స్పీడ్ కి బ్రేక్ పడింది.
కొంత కాలంగా ఆయన మీడియా ముందుకి సరిగా రావడం లేదు..! ఇక చాలా కాలం తరువాతా ఆయన మరోసారి మీడియా ముందు మెరిసాడు. మళ్ళీ విమర్శలు మొదలుపెట్టాడు.. జగన్ ని ఏకీ పారేశాడు. పరిపాలన చేతకాకపోతే పరిపాలన చేయడం వదిలెయ్యాలనిఆయన అన్నారు. ఎన్నికల వరకే పార్టీలు అని, ఆ తర్వాత అందరూ ఒకటేనని, గెలిచిన వాళ్లు పార్టీలకు అతీతంగా పని చేయాలని అన్నారు. టీడీపీ నేతలనీ కార్యకర్తలని టార్గెట్ చేయడం మాని అభివృద్ధి పై దృష్టి సాగించాలని ఆయన హితువు పలికారు. ప్రభుత్వ పని తీరుని ప్రజలే గమనిస్తున్నారని వారే సరైన సమాధానం చెబుతారని ఆయన వ్యాఖ్యానించాడు. తమ అధినేత చంద్రబాబు కి పదవులు ముఖ్యం కాదని ప్రజాక్షేమమే ముఖ్యం అని ఆయన తెలియజేశారు. అధికారంలో లేకపోయినా ప్రభుత్వం తమ పై కక్ష సాధింపు చర్యలకి పాల్పడుతున్న తమ గళం వినిపిస్తూనే ఉంటామని ప్రజల గురించి పోరాడుతూనే ఉంటామని ఆయన స్పష్టం చేశారు.