బడ్జెట్ ప్రవేశపెట్టేది ఎవరు..? మామా..? లేక అల్లుడా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలంగాణకు కొత్తగా ఎంపికైన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదివారం నాడు ప్రమాణ స్వీకారం చేసింది. ఆమెతో పాటు మరో ఆరు గురు కొత్తగా ఎంపికైన తెలంగాణ మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రి వర్గంలో చోటు దక్కని కేటీఆర్ హరీష్ రావు లతో పాటు గంగుల కమలాకర్ సబితా ఇంద్ర రెడ్డి.. తదితరులు ఆమెతో ప్రమాణ స్వీకారం చేశారు. కొత్తగా ఏర్పడిన కేసీఆర్ కేబినెట్ లో ఇద్దరు మహిళలకి చోటు దక్కడం తెలంగాణ చరిత్ర లో ఇదే తొలిసారి. పాత, కొత్తల కలబోతగా, వివిధ సామాజిక, కుల సమీకరణల ఆధారంగా సీఎం కేసీఆర్ మంత్రివర్గాన్ని కూర్పు చేశారు.

కాగా హరీష్ రావుకి కీలక శాఖ అయిన ఆర్థిక శాఖ పదవిని అప్పగించారు కేసీఆర్. నిన్న బాధ్యతలు చేపట్టిన హరీష్ రావుకి అప్పుడే పెద్ద బాధ్యత వచ్చి పడింది. నేడు అసెంబ్లీ సాక్షిగా ఆయన బడ్జెట్ ని ప్రవేశ పెట్టనున్నారు. మంత్రుల ప్రమాణ స్వీకారం అనంతరం కేసీఆర్ మొత్తం తన 18 మంది కేబినెట్ తో సమావేశం జరిపారు. సమావేశం లో పలు అంశాల గురించి చర్చించి కార్యచరణ పై సుదీర్ఘ చర్చ జరిపారు. గతంలో టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల అనంతరం ఒటాన్ ఎకౌంట్ బడ్జెట్ ని ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. కాగా నేడు పూతిస్థాయి బడ్జెట్ ని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు 11 గంటలకు అసెంబ్లీ లో ప్రవేశపెట్టనున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: