టీఆర్ఎస్ మంత్రి వర్గం విస్తరణ విజయవతంగా జరిగింది. ఆదివారం నాడు తెలంగాణ కు కొత్త గవర్నర్ గా ఎంపికైన తమిళిసై సౌందరరాజన్ తో పాటు కేసీఆర్ కేబినెట్ లో నియమితులైన 6 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. నిన్న బాధ్యతలు చేపట్టిన 6 మంది కొత్త మంత్రులతో కేసీఆర్ మొత్తంగా 18 కి చేరిన కేసీఆర్ కేబినెట్. కాగా ఈసారి కేసీఆర్ కేబినెట్ లో ఇద్దరు మహిళా నేతలకి చోటు దక్కడం గమనార్హం. పాత, కొత్తల కలబోతగా, వివిధ సామాజిక, కుల సమీకరణల ఆధారంగా సీఎం కేసీఆర్ మంత్రివర్గాన్ని కూర్పు చేశారు..!
ఇద్దరు మహిలలని ఒక విధ్యావంతుడిని తన కేబినెట్ లో చేర్చుకున్న సీఎం కేసీఆర్ పై ఓపక్క ప్రజలు ప్రశంసలు కురిపిస్తుంటే మరోపక్క రాజకీయ విశ్లేషకులు ప్రతిపక్షాలు మాత్రం ఆయన పై మంది పడుతున్నాయి. కేసీఆర్ కుటుంబ పాలన చేస్తున్నాడని అల్లుడిని కొడుకుని మరోసారి కేబినెట్ లో చేర్చి తాను కుటుంబ పాలన చేస్తున్నాడు అని వస్తున్న ఆరోపణలని రుజువు చేతున్నాడని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. బీజేపీ వ్యూహం ప్రకారం ఓ మహిళని తెలంగాణ కి గవర్నర్ గా పంపినందుకు తన కేబినెట్ లో కూడా మహిళా మంత్రి ఉంటే బాగుంటుందని కేసీఆర్ భావించి ఇలా ప్లాన్ చేశారని అంటున్నారు. తనకి మహిళలపై అంతా గౌరవం ఉంటే ఇప్పటికే నాలుగు సార్లు ఆయన కేబినెట్ ని విస్తరించగా ఏ ఒక్కసారి కూడా మహిళలకి ఎందుకు అవకాశం కల్పించలేదని వారు ప్రశ్నిస్తున్నారు. మహిళా గవర్నర్ రాగానే కేసీఆర్ కి మహిళలపై ఎప్పుడూ లేని గౌరవం వచ్చేసిందని వారు విమర్శిస్తున్నారు. కుటుంబ పాలన చేసే నియంత అని విమర్శిస్తున్నారు.