కృష్ణమ్మ ప్రవాహం..గోదారి ఉగ్రరూపం..!

Google+ Pinterest LinkedIn Tumblr +

భారీ వర్షాల కారణంగా కర్ణాటకలోని ప్రాజెక్టులన్నీ పూర్తిగా నిండి పోయాయి. దీంతో ఆల్మట్టి , నారాయణపూర్ నుంచి నీటిని వదులుతున్నారు అధికారులు. దీని కారణంగా జూరాల నిండు కుండను తలపిస్తోంది. పెద్ద ఎత్తున నీరు చేరుకోవడంతో జూరాల లోని 22 గేట్లను పూర్తిగా ఎత్తి వేశారు. దీంతో శ్రీశైలంకు భారీగా నీరు చేరుకుంటోంది. అక్కడి నుంచి దిగువన నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కు నీటిని వదులుతున్నారు అధికారులు. అయితే ఆరు క్రస్ట్ గేట్లపై నుంచి నీరు పారుతుండడంతో చుట్టుపక్కన ఉన్న గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సాగు చేసుకున్న పంట పొలాలు నీట మునిగాయి. జూరాలతో పాటు సుంకేశుల ప్రాజెక్టు నుంచి కూడా శ్రీశైలంకు నీరు చేరుతోంది.

మరో వైపు గోదావరి ఉగ్ర రూపం దాల్చుతోంది. దిగువన ఉన్న లంక గ్రామాలకు వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రమాదకర స్థాయి దాటి ప్రవహిస్తుడడంతో అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారే చేశారు. శ్రీశైలం గేట్లను ఎత్తకుండా అధికారులు నిర్లక్ష్యం వహించడంపై భాదితులు వాపోయారు. స్పిల్ వే కాకుండా గేట్ల పై నుంచి నీరు పారుతుండడంపై మండి పడుతున్నారు. ఇదిలా ఉండగా వందలాది ఇల్లు నీట మునిగాయి. 36 గ్రామాలకు పూర్తిగా రాక పోకలు నిలిచి పోయాయి. గోదావరి పరివాహక ప్రాంతాలన్నీ ఇప్పుడు ప్రమాదకర స్థితిని ఎదుర్కొంటున్నాయి.

గత అయిదు రోజులుగా వరద ఉదృతి పెరుగుతోంది తప్పా తగ్గడం లేదు. పోలవరం ప్రాజెక్ట్ నుండి బ్యాక్ వాటర్ ఎక్కువగా రావడం వల్లనే తాము ఇబ్బందులు పడుతున్నామని బాధితులు వాపోతున్నారు. చాలా మంది జలదిగ్బంధంలో చిక్కుకున్నారు. సాయం కోసం ఎదురు చూస్తున్నారు. నీళ్ల దెబ్బకు పూరిళ్లు కూలి పోతున్నాయి. భద్రాచలం కు వరద తాకిడి తగ్గినా తూర్పు గోదావరి జిల్లాలో అంతకంతకు పెరుగుతోంది . దేవీపట్నం తో పాటు చుట్టూ పక్కల గ్రామాలకు వరద నీరు చేరుకుంది. 12 వందల ఇల్లు నీట మునిగాయి. రంపచోడవరం ఐటీడీఏ ఆధ్వర్యంలో నాలుగు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి జనాన్ని తరలిస్తున్నారు. మొత్తం మీద కృష్ణమ్మ , గోదారి నదులు ఉగ్ర రూపం దాల్చుతున్నాయి. రాబోయే రోజుల్లో మరింత ప్రమాదకర స్థాయిని దాటే అవకాశం ఉంది.

Share.

Comments are closed.

%d bloggers like this: