Advertisements

అదరగొడుతున్న నాగ్..శివగామి కొత్త షో..!

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగు బుల్లితెరపై ఎంతో ప్రేక్షకాదరణ పొందిన రియాల్టీ షో బిగ్ బాస్.. ప్రారంభం కంటే ముందే ఈ కార్యక్రమంపై తీవ్ర ఆరోపణలు, విమర్శలు చోటు చేసుకున్నాయి. జర్నలిస్ట్ శ్వేతా రెడ్డి ఏకంగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశారు. వీటన్నిటి మధ్య బిగ్ బాస్ స్టార్ట్ అయ్యింది. స్టార్ యాజమాన్యం ఊహించని రీతిలో మిగతా వినోదపు ఛానల్స్ ను దాటుకుని టాప్ రేటింగ్స్ లో దూసుకు పోయింది. దీంతో భారీ ఆదాయం సమకూరుతోంది స్టార్ మా టీవీకి. బిగ్ బాస్ రోజు రోజుకు భిన్నంగా వెళుతోంది. అత్యంత జనాదరణ ఉంటోంది దీనికి. మొదటి సీజన్ కు జూనియర్ ఎన్ఠీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా..రెండో సీజన్ కి న్యాచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా వ్యహరించారు..కాగా ఇప్పుడు ముచ్చటగా మూడో సారి అక్కినేని నాగార్జున హోస్ట్ గా అదరగొడుతున్నారు.

ఇప్పటికే ఈ ప్రోగ్రాం 50 రోజులు పూర్తి చేసుకుంది. మొత్తంగా దీని నిడివి 100 రోజులు..కాగా, రోజు రోజుకు ఉత్కంఠను రేపుతూ ..ట్విస్టులతో దుమ్ము రేపుతోంది. బర్త్ డే సందర్బంగా నాగార్జున ఫారిన్ టూర్ కు వెళితే ఆయన స్థానంలో రమ్యకృష్ణ హోస్టుగా వచ్చారు. ఆమెకు విపరీతమైన ఆదరణ లభించింది. ఎలా నడిపిస్తోందనని అనుకున్న వారి అంచనాలు తలకిందులు చేస్తూ రమ్యకృష్ణ సక్సెస్ అయ్యారు. బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేస్తున్న వారిని ఒక ఆట ఆడించారు. దీంతో స్టార్ మా టీవీ యాజమాన్యం ఈమెతో మరో కొత్త ప్రోగ్రాం స్టార్ట్ చేయాలని భావిస్తోందట. మా ఏది చేసినా ఇప్పుడు ఆ ప్రోగ్రాం ఆదరణ చూరగొంటోంది. ఇప్పటి వరకు బుల్లి తెరపై టాప్ రేంజ్ లో ఉన్న జీ టీవీ సీరియల్స్ ను దాటుకుని మా టీవీ సీరియల్స్ టాప్ పొజిషన్ కు చేరుకున్నాయి. వీటిలో కార్తీక దీపం మొదటి ప్లేస్ లో ఉండగా .. రాధమ్మ కూతురు సీరియల్ తో జీ టీవీ పోటీ పడుతోంది. ప్రస్తుతం బిగ్ బాస్ లో విన్నర్ గా భావించిన ఆలీ ఎలిమినేటి కావడం విస్తు పోయేలా చేసింది. చివరకు ఎవరు గెలుస్తారనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మిగిలింది.

Advertisements
Share.

Comments are closed.

%d bloggers like this: