పెద్ద మనసు చేసుకోండీ..! కేసీఆర్ కి పవన్ రిక్విస్ట్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

కాస్త పెద్ద మనసు చేసుకోండీ.. సీనీ కార్మికుల ఇళ్ల స్థాలానికి కేటాయించిన భూమిని మరి కొంత పెంచండీ అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ కి లేఖ రాశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మీరు కేటాయించిన స్థలాన్ని మరి కొంత పెంచుతే 30 వేల మంది కార్మికులకి గూడు కల్పించిన వారవుతారని ఆయన తెలంగాణ సీఎం కేసీఆర్ ని విన్నపించుకున్నారు. హైదరబాద్ లోని జనసేన పార్టీ కార్యలయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్ పార్టీ సభ్యులతో కొంత సేపు సమావేశమై సీఏం కేసీఆర్ కి ఈమేరకు విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్‌ చిత్రపురి కాలనీలో ఇళ్లు దక్కని సినీ కార్మికుల.. మరికొంత స్థలాన్ని కేటాయించాలని ఆయన సీఎం కేసీఆర్ కి మర్యాద పూర్వకంగా విజ్ఞప్తి చేశారు. హైదరబాద్ కి చేరుకున్న జనసేనాని జనసేన పార్టీ కార్యాలయంలో తెలుగు సినీ వర్కర్స్‌ కోపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీ కార్యవర్గ సభ్యులతో సమావేశమయ్యారు. వారు చెప్పుకున్న కష్టాలు విని ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. అవసరమైతే ప్రభుత్వానికి జనసేన పార్టీ తరపున వినతి పత్రం అందిస్తామని పవన్ కళ్యాణ్ అన్నారు. చిత్రా పరిశ్రమ కోట్లాది మందికి వినోదాన్ని ప్రభుత్వానికి కోట కొద్ది రూపాయాలని సమకూర్చింది. ఎంతో మందికి ఉపాడి కల్పిస్తుంది.. వీరి పట్ల ప్రభుత్వం ప్రత్యేక దృష్టి వహించాలని పెద్ద మనసు చేసుకోవాలని ఆయన కోరారు.

Share.

Comments are closed.

%d bloggers like this: