ప్రియుడి పై మోజు.. భర్తని హత్య…ఆపై ఆత్మహత్య గా చిత్రీకరణ..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రియుడి పై మోజుతో పెళ్లి చేసుకున్న భర్తనే కడతేర్చిందో కసాయి భార్య. భర్త మిలిటరిలో పని చేస్తుంటాడు.. ఆమె ఇంట్లోనే ఉంటుంది. భర్త ఎప్పుడూ తనకి దూరంగా ఉండటంతో ప్రియుడితో సుఖం పొందుతూ వచ్చేది. ఆ సుఖం కాస్త అలవాటుగా మారింది. ఆ అలవాటు కాస్త భర్త పై ఉన్న ప్రేమని మించిపోయింది. ఆ ప్రేమే భర్త ప్రాణాలు తీసింది. భర్తని హత్య చేయించడమే కాకుండా ఆత్మహత్యాగా చిత్రీకరించింది. చట్టాన్న మోసం చేయడం చాత కాక చివరికి తానే ఈ విషయాన్ని బయటపెట్టింది. ఈ ఘటన విశాఖ నగరంలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. విశాఖపట్నం మద్దిలపాలెం ప్రాంతానికి చెందిన సతీష్‌కుమార్(32) సైన్యంలో పనిచేస్తుంటాడు. అతడికి గతంలో జ్యోతి అనే మహిళతో వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. సతీశ్‌ దేశ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తుంటే… జ్యోతి, అత్త, ఇద్దరు పిల్లలతో కలిసి వైజాగ్‌లోనే ఉంటోంది. ఆగస్ట్ నెలలో భర్త కి సెలవులు రావడంతో భర్త ఇంటికి తిరిగొచ్చాడు. ఆగస్ట్ 19 న హటాత్తుగా భర్త సతీష్ ఫ్యాన్ కి ఉరేసుకున్నాడని జ్యోతి పోలీసులకి ఫిర్యాదు చేసింది. కుటుంబ సభ్యులు ఎవ్వరూ ఎలాంటి అనుమానాలు లేవదీసే సరికి పోలీసులు సతీష్ ఆత్మహత్య చేసుకునట్టు కేసు నమోదు చేసుకున్నారు.

తన భర్త చనిపోయిన మర్నాడు నుండే జ్యోతి భర్త కి రావాల్సిన డబ్బు గురించి ఆర్మీ అధికారులతో సంప్రదింపులు ప్రారంభించేసింది. తన వైఖరి కానీ తన ముఖం లో కానీ ఎలాంటి బాధ కనిపించకపోయేసరికి ఆర్మీ అధికారులకి అనుమానం వచ్చింది.. దీంతో పోలీసులకి ఈ అనుమానాన్ని వ్యక్తం చేసి కేసు ని పరిశీలించాలని కోరారు. రంగంలోకి దిగిన పోలీసులు తమదైన రీతిలో విచారణ ప్రారంభించేసరికి విషయం వెలుగులోకి వచ్చింది. ఇది ఆత్మహత్య కాదు హత్యేనని తేలిపోయింది.

అసలు కథ :

భర్త ఎప్పుడూ తనకి దూరంగా ఉండేసరికి జ్యోతికి కామ ప్రేరణ మొదలయ్యింది. జ్యోతికి సరిగ్గా 9 నెలల క్రితం పాత జైలురోడ్డుకు చెందిన సిమ్మా భరత్‌కుమార్‌(24) అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త అక్రమ సంబంధం అయ్యి.. అది హద్దుమీరింది. భారత్ నేరుగా జ్యోతి ఇంటికి వచ్చేసేవాడు. ఈ విషయాన్ని గమనించిన అత్తమ్మ జ్యోతి తో తాను చేస్తున్న పని తప్పని మందలించింది. వెంటనే ఆపమని హెచ్చరించింది. ఎంత చెప్పినా వినని జ్యోతి అలాగే తన అక్రమ సంబంధాన్ని కొనసాగించుకుంటూ వచ్చింది. ఆగస్ట్ లో సెలవలకి అని వచ్చిన సతీష్ కి అత్త ఈ విషయాన్ని చెప్పగా జ్యోతిని వారించాడు. తాను చేస్తుంది సరికాదు వెంటనే ఆపేయమని హెచ్చరించాడు. దీంతో ఈ విషయాన్ని తన ప్రియుడికి చెప్పి ఎలాగైనా తన భర్త ని హత్య చేయాలని ప్రియుడిని కోరింది. 18 వ తారికున భర్త సతీష్ నిద్ర మత్తులో ఉండగా ఇంట్లోకి జొరబడ్డ భరత్ అతని మిత్రుడు భాస్కర్ రావు సతీష్ మెడకి చూన్ని వేసి పీక నులిమి చంపేశారు. ఈ విషయాన్ని కప్పిపుచ్చడానికి జ్యోతి తన భర్త ఆత్మహత్యకి పాల్పడ్డాడని కేసు ని తారుమారు చేసింది. పోలీసులు విచారణ చేయడం తో విషయాన్ని తాను భయాత పెట్టింది.. మంగళ వారం నాడు పోలీసులు నింధితులని మీడియా ముందు హాజరు పరచారు.

Share.

Comments are closed.

%d bloggers like this: