పదవిపై బెంగతో జోగు రామన్న కంటతడి..కిరోసిన్ పోసుకొని..!

Google+ Pinterest LinkedIn Tumblr +

టీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్న కంటతడి పెట్టారు. మంత్రి పదవి రాకపోవడంతో మనస్తాపం చెందినట్లు మీడియా సమావేశంలో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి పదవి ఇస్తారని ఆశతో ఉన్నట్లు తెలిపారు. సర్పంచ్ స్థాయి నుంచి మచ్చలేని వ్యక్తిగా ఉన్న తనకు మంత్రి పదవి రాకపోవడంతో మనస్తాపానికి గురైనట్లు పేర్కొన్నారు. ఆ బాధతో బీపీ అధికంగా వచ్చి ఆస్పత్రిలో చేరినట్లు స్పష్టం చేశారు. అంతేతప్ప అజ్ఞాతంలోకి వెళ్లాల్సిన అవసరం తనకి లేదని వెల్లడించారు. కేసీఆరే తమ నాయకుడిగా చెప్పుకొచ్చారు. మరో పక్క తమ నాయకుడు జోగు రామన్నకు మంత్రి పదవి రాలేదన్న బాధతో ఆయన అభిమాని జిల్లా కేంద్రంలో కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో పోలీసులు, కార్యకర్తలు అప్రమత్తమై అడ్డుకున్నారు. మంత్రివర్గ విస్తరణ టీఆర్ఎస్‌లో పెద్ద చిచ్చేపెట్టింది. ఇప్పటికే పలువురు నేతలు పార్టీ అధిష్టానంపై అసంతృప్తిని వెళ్లబుచ్చారు.

Share.

Comments are closed.

%d bloggers like this: