ఫోన్లో భర్త..పాములపై భార్య..చివరికి ఇలా..!

Google+ Pinterest LinkedIn Tumblr +

విదేశాల్లో ఉండే భర్త ఫోన్ చేయడంతో అతనితో మాట్లాడుతూ చూసుకోకుండా మంచం మీద ఉన్న పాములపై కూర్చోవడంతో అవి కాటేశాయి. దీంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ సమీపంలోని రియాన్వ్ గ్రామంలో బుధవారం జరిగింది. పూర్తి వివరాలు ఇలా…రివాయ్ గ్రామానికి చెందిన జయసింగ్ థాయ్‌లాండ్‌లో ఉంటున్నాడు. అతడి భార్య గీత పిల్లలతో కలిసి గ్రామంలోనే ఉంటోంది. బుధవారం భర్త ఫోన్ చేయడంతో గీత మాట్లాడుతోంది. అంతలో రెండు పాములు ఇంట్లోకి ప్రవేశించి మంచం మీదున్న రంగుల దుప్పటిపైకి చేరాయి. పాములను గుర్తించని గీత మాటల్లో పడి వాటి మీద కూర్చుంది..అనంతరం గీత తేరుకుని పైకి లేచేలోపే ఆ పాములు కాటేశాయి. దీంతో గీత కేకలు వేసుకుంటూ కింద పడిపోయింది. ఆమె నోటి నుంచి నురగలు రావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో గీత ఆస్పత్రిలో చనిపోయింది. ఇంటికి తిరిగి వచ్చిన బంధువులకు గదిలో మంచంపై పాములు ఆడుకుంటూ కనిపించడంతో కర్రలతో కొట్టి వాటిని చంపేశారు.

Share.

Comments are closed.

%d bloggers like this: