రాహల్ అవుట్..శుభమన్ ఇన్..ధోనీ వైరల్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

భారత్ లో పర్యటించే సౌత్ ఆఫ్రికా తో జరిగే టెస్ట్ మ్యాచ్ లకు భారత క్రికెట్ జట్టులో ఎవరెవరు ఉంటారనే ఉత్కంఠకు తెర పడింది. ఈ మేరకు బీసీసీఐ చర్మన్ ఎమ్మెస్కె ప్రసాద్ టీమిండియా ఆటగాళ్లను ప్రకటించారు. అందరూ అనుకున్నట్టుగానే ఎన్నో సార్లు అవకాశాలు ఇచ్చినా కేఎల్ రాహుల్ సద్వినియోగం చేసుకోలేక పోయాడు. దీంతో ప్రకటించిన జాబితాలో రాహుల్ పై వేటు పడింది. రోహిత్ ను ఓపెనర్ గా ఎంపిక చేశారు. భారత జట్టు మూడు టెస్ట్ లు సౌత్ ఆఫ్రికాతో ఆడనుంది. దీని కోసం పెద్ద ఎత్తున కసరత్తు చేసింది ఎంపిక కమిటీ . జట్టుకు శుభారంభాన్ని ఇచ్చేలా తిరిగి రోహిత్ శర్మకు ఛాన్స్ ఇచ్చారు. ఇదే విషయాన్నీ ఎమ్మెస్ కె వెల్లడించారు. ఇంకో వైపు పరుగుల వరద పారిస్తున్న పంజాబ్ ఆటగాడు శుభమన్ గిల్ కు టెస్టుల్లో ఆడే అవకాశాన్ని కల్పించారు.

మరో వైపు మాజీ జట్టు సారధి ఎమ్మెస్ ధోనీ ఆట నుంచి తప్పుకుంటున్నారన్న వార్తలు గుప్పుమన్నాయి. కానీ దీనిని సెలెక్షన్ కమిటీ చైర్మన్ ప్రసాద్ కొట్టి పారేశారు. దేశ వ్యాప్తంగా ఆ వార్త ట్రోల్ అయ్యింది. గత నాలుగు ఇన్నింగ్స్ లలో కేవలం 25 సగటుతో 101 పరుగులు మాత్రమే చేసిన రాహుల్ ను పక్కన పెట్టారు . కాగా వెస్ట్ ఇండీస్ పర్యటనలో ఇండియా – ఏ జట్టు తరపున శుభమన్ గిల్ దుమ్ము రేపాడు. దీంతో అతడికి జట్టులో చోటు దక్కింది. మరోవైపు అవకాశాలు ఇస్తున్నా సద్వినియోగం చేసుకోలేక పోతున్నప్పటికీ రోహిత్ శర్మకు మరోసారి ఎంపిక చేసారు. రాహుల్ తో పాటు మీడియం పేసర్ ఉమేష్ యాదవ్ కూడా జట్టులో స్థానం కోల్పోయాడు. ఇంకో వైపు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యకు చోటు దక్కలేదు.

26 న విజయనగరంలో దక్షిణాఫ్రికాతో తలపడే బోర్డు ప్రెసిండెట్స్ లెవెన్ కు రోహిత్ శర్మ సారధిగా ఉంటాడు. తొలి టెస్ట్ వైజాగ్ లో, రెండో టెస్ట్ పూణే లో , మూడో టెస్ట్ రాంచీలో ఇండియా ఆడనుంది. ఇదిలా ఉండగా టీమిండియా జట్టులో సమతూకం పాటించేలా చూశారు చైర్మన్ ప్రసాద్. జట్టు సారధిగా కోహ్లీ , మయాంక్ , రోహిత్ , పుజారా, రహానే , విహారి, రిషబ్ పంత్, వృద్ధిమాన్ సాహా, రవిచంద్రన్ అశ్విన్, జడేజా , కుల్ దీప్ , మహమ్మద్ షమీ, బుమ్రా, ఇషాంత్ , గిల్ లను ప్రకటించారు. మొత్తం మీద జట్టు పై సీనియర్ ఆటగాళ్లు ఎలాంటి కామెంట్స్ చేయక పోవడం విశేషం. యువ జట్టును రాహుల్ ద్రావిడ్ మరింత ప్రతిభను చాటేలా చేస్తున్నాడు. దీంతో బీసీసీఐ కి ఇప్పుడు ఆటగాళ్ల కొరత లేకుండా పోయింది. విహారి జట్టులో ఉండటంతో తెలుగు వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: