హౌస్ లో మహేష్ చేసిన పనికి వరుణ్ కన్నీళ్లు …..!

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగు లో వస్తున్న బిగ్ బాస్ 50 రోజులు దాటిపోయింది. ఇంటి సభ్యుల మద్య ఇప్పుడు రసవత్తరమైన పోటీ నెలకొంది. ఇకనుంచి మీరు ఫినాలే కోసం కష్టపడాలని..చిల్లర పనులు, నవ్వులు, అల్లరి పక్కనబెట్టి గేమ్, టాస్క్ పై గట్టి ఫోకస్ పెట్టానిన ఇంటి సభ్యులకు బిగ్ బాస్ సూచించారు. దీనితో బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్ లన్నింటినీ పార్టిసిపేట్స్ తమ అన్ని శక్తి యుక్తుతలతో ఆడటం జరుగుతుంది . ఈ టాస్కులో భాగంగానే బిగ్ బాస్ ఒక షాకింగ్ డెసిషన్ తీసుకోవడం జరిగింది .

ప్రతివారం బిగ్ బాస్ నుండి ఒక పార్టిసిపెంట్ ఎలిమినేట్ అవుతాడని మీకందరికీ తెలిసింది . కానీ బిగ్ బాస్ చరిత్రలో తొలిసారి వీకెండ్ కి ముందే పార్టిసిపెంట్ పెట్ట బేడ సర్దుకుని ఇంటికి వెళ్లడం జరిగింది . ఈ అనుకోని సంఘటన కి హౌస్ మేట్స్ ఆశ్చర్యానికి గురయ్యారం . బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వెళ్తుంది ఎవరో కాదు మహేష్ . బిగ్ బాస్ ఆదేశాలమేరకు మహేష్ బిగ్ బాస్ నుండి వెళ్లిపోవాల్సి వస్తుంది . అనుకోకుండా స్టోర్ రూమ్ కి వితికా వెళ్ళేసరికి మహేష్ విట్టా సూట్ కేస్ ఉంటుంది. అది చూసి ఆశ్చర్యపోతుంది వితికా. ఇంతలోకి మహేష్ కోపంగా ఆ సూట్ కేస్ ను బెడ్ పై పడేసి అందులో బట్టలు సర్దుకుంటాడు.

ఈ హఠాత్తు పరిణామానికి వరుణ్ షాక్ అయ్యి… కంటతడి పెడతాడు. దీంతో మహేష్ వరుణ్ తో….నాకు ఇంటి నుంచి వెళ్లిపోతునందుకు బాధ లేదని చెప్పి నడుచుకుంటూ గెట్ వరకు వెళ్తాడు. ఇదంతా కూడా కోద్దిసేపటి క్రితం విడుదలైన ప్రోమోలో చూపెట్టడం జరిగింది . అయితే ఇక్కడే చిన్న ట్విస్ట్ ..మహేష్ ఎలిమినేట్ అయింది ఏమాత్రం నిజంకాదు . బిగ్ బాస్ టాస్క్ లో భాగంగా , తానూ ఎలిమినేట్ అవుతున్నానని , బిగ్ బాస్ నన్ను ఇంటి నుండి వెళ్ళిపోమన్నాడని ,మహేష్ ని హౌస్ మేట్స్ కి నమ్మించాలన్నది టాస్క్ . ఈ టాస్క్ ని మహేష్ తన నటనతో పండించడం , హౌస్ మేట్స్ షాక్ అవ్వడం,ఏకంగా వరుణ్ కన్నీళ్లు పెట్టుకోవడం , ఈ ప్రోమో హైలైట్స్ .

Share.

Comments are closed.

%d bloggers like this: