Advertisements

వైల్డ్ కార్డ్ ఎంట్రీలకి కలిసిరాని బిగ్ బాస్ హౌస్..! ఈవారం శిల్పా అవుట్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రపంచవ్యాప్తంగా ఎందరో అభిమానులని సంపాదించుకొని బుల్లితెరలో ప్రసారం అయ్యే రియాలిటీ షో లలో బెస్ట్ షోగా పేరు పొందింది బిగ్ బాస్. ఇక తెలుగు లో కూడా ఈ షో కి మంచి ఫాలోయింగ్ ఉంది. సాయంత్రం 9 దాటిందంటే చాలు అందరూ అన్నీ పనులు ఆపేసి టీవీ లకి అతుక్కుపోతున్నారు. ప్రతీ వారం ఆకట్టుకునే టాస్క్ లు వారం చివరన ఎలిమినేషన్.. ఈ షో ప్రత్యేకతలు.. తమ అభిమాన కంటెస్టెంట్ లని ఇంట్లో ఉంచడానికి అభిమానులు తెగ వోట్లు వేసేస్తున్నారు. ఇక ఈ వారంకి గాను హిమజ, శ్రీముఖి, మహేశ్ విట్టా, పునర్ణవి, కొత్తగా ఇంట్లోకి వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీ శిల్పా చక్రవర్టీ లు నామినేషన్ లో ఉన్నారు.

వీరీని కాపాడటానికి అభిమానులు ఇప్పటికే తమ వొట్లని వేసేశారు. శనివారం రాత్రి 12 గంటల వరకు జరిగిన వోటింగ్ ప్రక్రియ ప్రకారం ఇప్పటికే పలు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.. ఈ వారం వీళ్ళు ఎలిమినేట్ అవుతున్నారని కొన్ని సైట్లు.. ఇంకొకరు ఎలిమినేట్ అవుతున్నారని కొన్ని సైట్లు.. ఇలా ఎక్కడ చూసినా ఎలిమినేషన్ గురించే చర్చలు అవుతున్నాయి. కానీ దాదాపుగా అన్నీ వెబ్ సైట్ లలో ఎనాలిసిస్ ప్రకారం ఈ వారం శిల్పా చక్రవర్తి ఎలిమినేట్ అవుతుందని తెలుస్తుంది. తొలి 5 రోజులు స్తబ్దుగా సాగిన ..వీకెండ్ మాత్రం నాగ్ ఎంట్రీతో ఎలిమినేషన్ ప్రక్రియపై ఎక్కడలేని ఆసక్తి నెలకొంటుంది . వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో కలుపుకుని 17 మందితో ప్రారంభమైన బిగ్ బాస్ గేమ్‌లో ఎనిమిదవ వారానికి 11 మంది సభ్యుల మాత్రమే మిగిలారు. పైగా ఈ సీజన్ లో వైల్డ్ కార్డ్ గా వచ్చిన వ్యక్తులు వాళ్ళు నామినేట్ అయిన మొదటి వారం లోనే ఎలిమినేట్ అయిపోతున్నారు.. ఈ సీజన్ కి ఇదో లాంఛనంగా మారింది.. కాబట్టి దాదాపుగా శిల్పా ఎలిమినేట్ అవ్వడం ఖాయం అనే వార్తాలకి ప్రాధాన్యత సంతరించుకుంది.

Advertisements
Share.

Comments are closed.

%d bloggers like this: