బాలీవుడ్ అగ్ర హీరోతో… సందీప్ రెడ్డి వంగా..! ”డెవిల్”..!

Google+ Pinterest LinkedIn Tumblr +

అర్జున్ రెడ్డి సినిమా లో హీరో ఎంత దురుసుగా ఉంటాడో ఆ సినిమా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా రియల్ లైఫ్ లో అంత దురుసుగా ఉంటాడు.. వ్యక్తిత్వానికి మంచివాడే కానీ తనని కానీ తన సినిమాల్ని కానీ ఎవరైనా ఏమైనా అన్నారంటే వాళ్ళతో దురుసుగా ఉంటాడు.. ఫేమస్ క్రిటిక్ రాజీవ్ మసంద్ లాంటి వారిని సైతం పబ్లిక్ గా ఏకీ పారేశాడు మన తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. రామ్ గోపాల్ వర్మ స్థాయిలో సమాధానాలు ఇస్తూ ఉంటాడు.. ఆయన తరువాత ఇప్పుడు ఈయనే అంటున్నారు బాలివుడు క్రిటిక్ లు.. ఎందుకు అంటున్నారు అనుకుంటున్నారా..? ముందు తెలుగు లో మంచి పేరు తెచ్చుకొని ఆపై బాలీవుడ్ లో అడుగుపెట్టాడు ఆర్జీవీ.. బాలీవుడ్ లో ఆగ్రా నటులతో ఆయన పని చేశారు.. సినిమాలు తీసి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా కూడా ఈయన రూట్ లోనే నడుస్తున్నాడు. బాలీవుడ్ లో వరుస ఆఫర్లు వస్తున్నాయి.. త్వరలో భారీ ప్రాజెక్ట్ లు చేయబోతున్నాడు.

తెలుగు లో అర్జున్ రెడ్డి తో మనందరికీ పరిచయం అయ్యి.. ఆపై బాలీవుడ్ లో అడుగు పెట్టాడు..! అక్కడ శాహిద్ కపూర్ తో కబీర్ సింగ్ సినిమా చేసి క్రిటిక్ ల ప్రశంసలు కూడా పొందాడు. ఇక బాలీవుడ్ లో కబీర్ సింగ్ మంచి హిట్ కొట్టడంతో అక్కడి ప్రముఖ హీరోల దృష్టి తన వైపు మరల్చుకున్నాడు. బాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ రణబీర్ కపూర్ తో సినిమా చేయబోతున్నాడు. రణబీర్ కి మంచి స్టోరీ లైన్ చెప్పాడు.. రణబీర్ కి కథ చాలా ఇంటెరెస్టింగ్ గా అనిపించడంతో ఆయాన కథకి ఒకే చెప్పేశాడు.. త్వరలో సినిమా సెట్స్ మీదకి వెళ్లనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక కథ విషయానికొస్తే.. ఒక ఇంటెన్స్ ఏమోషినల్ క్రైమ్ డ్రామా… సినిమాలో రణబీర్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రను పోషించనున్నాడట. అంతేకాకుండా ఈ సినిమాకు సందీప్ వంగా ‘డెవిల్’ అనే బోల్డ్ టైటిల్ పరిశీలిస్తున్నాడని సమాచారం. బాలీవుడ్ మీడియాలో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్. రణబీర్ కపూర్ కి బాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ ఉంది అలాంటి హీరో తో మన తెలుగు డైరెక్టర్ సినిమా చేయడం మనందరికీ గర్వకారణం. మొత్తానికి రామ్ గోపాల్ వర్మ రూట్ నే ఈయన కూడా ఫాలో అవుతున్నాడని తెలుస్తుంది.

Share.

Comments are closed.

%d bloggers like this: