విజయ్ ‘బ్రేక్ అప్‘.., ఎక్కడ.. ఎప్పుడు.. ఎవరితోనో తెలుసా …?

Google+ Pinterest LinkedIn Tumblr +

విజయ్ దేవరకొండకి బ్రేక్ అప్ అయిందా …, ఎవరితో..? ఎప్పుడు….? అసలు ఆయన లవ్ లో ఎప్పుడు పడ్డాడు, ఇంతకి బ్రేక్ అప్ ఎందుకైంది… అని మీ బుర్రలు బాదుకోకండి …, అయితే నిజంగానే విజయ్ బ్రేక్ అప్ చెప్పేసాడు ..కాని రియల్ లైఫ్ లో మాత్రం కాదు… ప్రస్తుతం తానూ నటిస్తున్న క్రాంతి మాధవ్ సినిమాలో. సో రౌడీ ఫాన్స్ జస్ట్ చిల్ ..మీ రౌడీకి ఎలాంటి రియల్ బ్రేక్ అప్ అవ్వలేదు ..

క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ పై ,కే ఎస్ రామారావు నిర్మాతగా ,సెన్సిబుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో విజయ్ చేస్తున్న సినిమాకి “ బ్రేక్ అప్ “ అనే టైటిల్ కన్ఫర్మ్ చేసారు చిత్ర యూనిట్ . ఈ చిత్ర షూటింగ్ కూడా చివరిదశకు వచ్చేసింది. ఈ చిత్ర టైటిల్ ని కూడా విడుదల చేయనున్నారు దర్శక నిర్మాతలు..,. వరల్డ్ ఫేమస్ లవర్ అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రంలో నలుగురు హీరోయిన్లతో ఆడిపాడనున్నాడు మన రౌడీ .. రాశీ ఖన్నా మెయిన్ హీరోయిన్ కాగా.. కేథరిన్ థ్రెసా, ఐశ్వర్యా రాజేష్, ఎజిబెల్లా మరో ముగ్గురు హీరోయిన్లు. నాలుగు బామలు కథలో బాగైమైనందుకు ,కచ్చితంగా ఇది విజయ్ బ్రేక్ అప్ స్టోరీస్ హైలైట్ గా ఉండొచ్చని .., అందుకే బ్రేక్ అప్ అనే టైటిల్ పెట్టి ఉండొచ్చని ప్రచారం జరుగుతుంది. మొత్తానికి డియర్ కామ్రేడ్ ఫ్లాప్ కావడంతో ఈ చిత్రం ఈయన కెరీర్‌కు కీలకంగా మారింది. మళ్ళీ మళ్లీ ఇది రానిరోజు సినిమా తర్వాత సరైన విజయం లేని క్రాంతి మాధవ్.. విజయ్ సినిమాతో ఫామ్‌లోకి రావాలని చూస్తున్నాడు.

Share.

Comments are closed.

%d bloggers like this: