బిగ్ బస్ టాప్- ౩ కంటెస్టెంట్స్ పై కౌశల్ సంచలన వ్యాఖ్యలు…!

Google+ Pinterest LinkedIn Tumblr +

బిగ్ బాస్ సీజన్ 2 పేరు చెప్పగానే అందరికి టక్కున గుర్తొచ్చే పేరు కౌశల్. న్యాచురల్ స్టార్ నాని హోస్టు చేసిన ఈ షోలో, కౌశల్ ఆర్మీ పేరిట కౌశల్ ఫాన్స్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. టీవీ ప్రింట్ వెబ్ మీడియాలో ఎక్కడ చూసిన కౌశల్ ఆర్మీ హవానే. బిగ్ బాస్ లో ఎవరుండాలి ఎవరు ఎలిమినేట్ అవ్వాలన్నది కూడా కౌశల్ ఆర్మినే డిసైడ్ చేసేది. హౌస్ లో కౌశల్ తో కొంచం తేడా చేసిన చాలు.. వాళ్ళను ఎలిమినేట్ చేసి పడేసే వారు కౌశల్ ఆర్మీ సభ్యులు . పేరుకి తగ్గట్టే కౌశల్ అభిమానులంత ఆర్మిలా ఫార్మ్ అయ్యి కౌశల్ బిగ్ బస్ విన్నర్ అయ్యేలా చేసారు. అయితే కొద్ది రోజుల క్రితం కౌశల్‌ ఆర్మీపైనా.. ఎన్నో ఆరోపణలు వచ్చాయి. దీని ద్వారా ఏర్పాటు ఫౌండేషన్‌, సేకరించిన నిధులను దుర్వినియోగం చేసినట్లు వార్తలు వచ్చాయి. కౌశల్‌ ఆర్మీని నడిపించిన అభిమానులు రోడ్డు మీదకు రావడం, మీడియా గడపలు తొక్కడం ఎంతటి దుమారం లేపిందో అందరికీ తెలిసిందే.

అయితే కొద్దిరోజులుగా కొంచం స్తబ్దుగా ఉన్న కౌశల్, మల్లి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనియంశంగా మారాడు. మొన్న రెండు రోజుల క్రితం హైదరాబాద్ లో జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న కౌశల్ తో ఒక జర్నలిస్ట్ ముచ్చటించటం జరిగింది. ఆ ఇంటర్వ్యూ లో కౌశల్ చెప్పిన అన్సర్స్ కి సదురు జర్నలిస్ట్ ముక్కున వేలేసుకోగా, అది చుసిన నేటిజన్స్ కూడా తెగ ట్రోల్ చేస్తున్నారు. “మీరు బిగ్ బాస్ 2 విన్నర్ కదా.. మరి ఇప్పుడు సీజన్ ౩ లో మీకు నచ్చిన ముగ్గురు పార్టిసిపెంట్స్ పేర్లు చెప్పండి అని ప్రశ్నించగా ..కౌశల్ మాట్లడుతూ “నేను ఇప్పుడు ఒకరి పేరు చెబితే నా ఆర్మీ అంతా వారికే సపోర్ట్‌ చేస్తుంది.. అప్పుడు మిగతావారికి అన్యాయం జరుగుతుంది అని సమాధానం చెప్పాడు” ఇక ఈ విషయంపై నెటిజన్లు కౌశల్‌ ని ఏకిపారేస్తున్నారు. కౌశల్ ఇంకా అదే భ్రమలో ఉన్నాడా? మీడియాలో నవ్వులపాలైన కౌశల్ ఆర్మీ అసలు ఉందా? అంటూ ఎవరికి తోచినట్లు వారు కామెంట్లు చేస్తుండగా.. అతని ఫాలోవర్స్‌ మాత్రం మంచి సమాధానమిచ్చావ్‌ అంటూ ఆకాశానికెత్తేస్తున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: