నరేంద్ర మోడీ బయో పిక్ కోసం రంగంలోకి దిగిన ప్రభాస్…..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆర్టికల్ 370 రద్దుతో తాజాగా భారతీయుల మనసుల్ని గెలిచిన మన ప్రదాని నరేంద్ర మోడీ పుట్టిన రోజు సందర్బంగా మోడీ బయోపిక్ ని అనౌన్స్ చేసారు బాలివుడ్ దిగ్గజ దర్శకుడు సంజయ్ లీల బన్సాలి. పద్మవత్, బాజీ రావ్ మస్తానీ, రామ్ లీల, దేవదాస్, బ్లాక్ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన ఈ క్రియేటివ్ జీనియస్ ఇప్పుడు మోడీ జీవితం ఆదరంగా నిర్మించే ఈ సినిమాకి “ మన్ భైరాగి “ అనే టైటిల్ ని కూడా కన్ఫర్మ్ చేసాడు. ఇంతటి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ లో మన రెబెల్ స్టార్ కూడా బాగామవుతుండటం మన తెలుగు వాళ్ళకి మరింత ఉత్సహమిస్తుంది.

బాహుబలితో బాలివుడ్ ని దున్నేసిన ప్రభాస్, సాహోతో బాలివుడ్ స్టార్ హీరోల్లో ఒకరిగా వెలుగొందుతూ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు . ఇంతటి ప్రభాస్ క్రేజ్ ని క్యాచ్ చేసుకునే పనిలా బాగంగా దస్ర్హకుడు సంజయ్ లీల బన్సాలి ఈ సినిమా టైటిల్ లోగో ని ప్రభాస్ తో లాంచ్ చేయించారు . జాతీయ స్థాయిలో తన మార్కెట్ స్టామినాను ప్రూవ్‌ చేసుకున్న ప్రభాస్‌, తన సోషల్‌ మీడియా పేజ్‌ ద్వారా మోదీ బయోపిక్‌ ‘మన్‌ బైరాగి’ ఫస్ట్‌ లుక్‌ను లాంచ్‌ చేశారు. తెలుగులో “ మనో విరాగి “ అనే టైటిల్ ని కన్ఫర్మ్ చేసారు … ఈ తెలుగు పోస్టర్‌ను ప్రభాస్‌ రిలీజ్ చేయగా… హిందీ పోస్టర్‌ను అక్షయ్‌ కుమార్ విడుదల చేశారు. సంజయ్‌ త్రిపాఠి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మహావీర్‌ జైన్‌తో కలిసి సంజయ్ నిర్మిస్తున్నారు. బాలివుడ్ మరియు సౌత్ ఇండియాలో ఎంతో మంది స్టార్లు ఉండగా , ప్రభాస్ తోనే ఈ లోగో లాంచ్ చేయించటం ప్రభాస్ సత్తాకి నిదర్శనమని , డార్లింగ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: