Advertisements

దారుణంగా పడిపోయిన గ్యాంగ్ లీడర్ కలెక్షన్స్ …, నాని మైండ్ బ్లాక్….!

Google+ Pinterest LinkedIn Tumblr +

గ్యాంగ్ లీడర్ టైటిల్ లో ఉన్న మాస్ అపీల్ సినిమాలో తగ్గిందా..? సినిమా సినిమాకి మార్కెట్ ను పెంచుకుంటూ పోయే నాని కి గ్యాంగ్ లీడర్ షాక్ ని ఇచ్చింద. ఇప్పటివరకు అందుతున్న ట్రేడ్ గణాంకాలు చూస్తే నాని అభిమానులు ఆశ్చర్య పోతారేమో. ఎప్పుడో నాలుగేళ్ళ కిందట విడుదలైన ఎంసీఏ సినిమా.. యావరేజ్ ఎంటర్టైనర్ అయినా దాదాపుగా 40 కోట్ల షేర్ ని కొల్లగొట్టింది. సాయి పల్లవి చరిష్మ కూడా ఆ సినిమాకి తోడైందని టాక్ ఉన్నా.. మల్లి ఆ ఫీట్ ని అందుకోవడంలో నాని మిస్ అవుతూ వస్తున్నాడు. ఆ రేంజిలో కాకపోయినా దరిదాపుల్లో కూడా నాని చేరుకోకపోవటం ఆందోళన కలిగించే అంశమే. ఎందుకో తెలిదు కాని గ్యాంగ్ లీడర్ సినిమా అనౌన్స్ మెంటు నుండే రావల్సినంత బజ్ ఈ సినిమాకి రాలేదు అని చెప్పొచ్చు. అనిరుద్ పాటలు ఆకట్టుకున్న…, ట్రైలర్ టిజర్స్ ప్రమోషన్స్ అంత ప్రామిసింగ్ గా ఉండకపోవడంతో నాని రేంజ్ ఓపెనింగ్స్ కూడా గ్యాంగ్ లీడర్ కి రాలేదు .

గ్యాంగ్ లీడర్ తొలిరోజు కేవలం 6 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఆ తర్వాత మూడు రోజుల్లో మరో 9 కోట్లు మాత్రమే తీసుకొచ్చింది. ఇక సోమవారం మరి ఘోరంగా 1 కోటి పదిహేను లక్షలు మాత్రమే వసూలు చేయడంతో 70 పర్సెంట్ కలెక్షన్స్ డ్రాప్ అయిపోయాయి. ఇక ఓవర్సీస్‌లో కూడా 7 లక్షల 50 వేల డాలర్లు వసూలు చేసింది ఈ చిత్రం. అక్కడ సేవ్ అవ్వాలంటే 1 మిలియన్ దాటాల్సిందే. ప్రస్తుతం ఏపీ, తెలంగాణల్లో నాలుగు రోజుల్లో 13 కోట్ల షేర్ వసూలు చేసింది గ్యాంగ్ లీడర్. ఇక్కడ 20 కోట్లకు ఈ చిత్ర రైట్స్ అమ్మారు దర్శక నిర్మాతలు. ఈ వారం కూడా కలెక్షన్స్ ఇదే తరహాలో ఉంటే, వచ్చే శుక్రవారం విడుదలయ్యే వాల్మీకి ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చిన , గ్యాంగ్ లీడర్ ఫ్లాప్ సినిమాల జాబితాలోకి వేసేయ్యల్సిందే అంటున్నారు ట్రేడ్ పండితులు .

Advertisements
Share.

Comments are closed.

%d bloggers like this: