ఏపీ ఎమ్మెల్యే ఇన్ తెలంగాణ అసెంబ్లీ..! కారణం ఏంటి..?

Google+ Pinterest LinkedIn Tumblr +

వైసీపీ ఎమ్మెల్యే తెలంగాణ అసెంబ్లీ లో..! అందేంటి ఆంధ్ర ఎమ్మెల్యే తెలంగాణ అసెంబ్లీ లో ఉండటం ఏంటి..? అని కన్ఫ్యూజ్ అవుతున్నారా..? వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి హటాత్తుగా తెలంగాణ అసెంబ్లీ లో ప్రత్యేక్షమయ్యారు. కొంతసేపు మంత్రి కేటీఆర్ తో ఆయన సమావేశమయ్యారు. సమావేశం అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ పథకాలను కేసీఆర్ ని వైసీపీ కాపీ కొడుతుందని వస్తున్న వార్తలు సారి కాదని ఆయన అన్నారు.

తమ ప్రియతమ నాయకుడు వైఎస్ అడుగుజాడల్లో ప్రభుత్వం నడుస్తుందని ఆయన ఆశయాలను నిరవర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు. గోదావరి, కృష్ణా అనుసంధానం చేస్తే రెండు రాష్ట్రాలకు మేలు జరుగుతుందని.. రాష్ట్రం విడిపోయాక కూడా రాయలసీమకు అన్యాయమే జరుగుతోందని వ్యాఖ్యానించారు. రెండు నదులు అనుసందానం చేయడం ముఖ్యం అని అందుకే తెలంగాణ ప్రభుత్వానికి మద్దత్తు పలుకుతున్నాం అని ఆయన తెలియజేశారు. అనంతరం ఆంధ్ర మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు మృతి పై ఆయన స్పందించారు. మరణానికి టీడీపీ ఏ కారణం అని ఆయన ఆరోపించారు. చంద్రబాబు కోడెల ని దూరం పెట్టేశాడని.. పార్టీ కార్యక్రమాలకి సమావేశాలకి కూడా పిలవట్లేదాని అందుకే ఆయన భావోద్వేగానికి గురయ్యారని ఆయన తెలియజేశారు. ప్రభుత్వం ఎవ్వరి పై తప్పుడు కేసులు పెట్టలేదని.. తప్పు చేస్తే ఎవ్వరికైనా కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు.

Share.

Comments are closed.

%d bloggers like this: