ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ ఈ నెల 16 న హైదరబాద్ లోని తన నివాసంలో ఆత్మహత్యలకి పాల్పడ్డారు. ప్రభుత్వ వేధింపుల కారణంగానే కోడెల ఈ చర్యకి పాల్పడ్డారని కుటుంభ సభ్యులు భావిస్తున్నారు.. మంగళవారం సాయంత్రం నాడు పోస్ట్ మార్టం అనంతరం కోడెల పార్థివ దేహం తన స్వగ్రామం అయిన నర్సారావుపేట కి చేరుకుంది. ఇక నేడు ఆయన అంత్యక్రియలు జరుగనున్నాయి. ప్రభుత్వ లాంఛనాల ప్రకారం కోడెల అంత్యక్రియలు జరపాలని సీఎం జగన్ సీఎస్ కి ఆదేశాలు ఇచ్చారు.
కాగా కుటుంబ సభ్యులు మాత్రం తమకి ఎటువంటి లాంచనాలు అవసరం లేదని ప్రభుత్వ వేధింపుల కారణంగానే కోడెల ఆత్మహత్యకి పాల్పడ్డాడని మండి పడుతున్నారు. మాకు నచ్చినట్టుగా మేము చేసుకుంటామని అత్యక్రియలు అయినా మాకు వదిలేయండి అని కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని తిరస్కరించారు. ఈ మేరకు నేడు ఉదయం 10 గంటలకి ఆయన స్వగ్రామం నర్సారావుపేటలో ఆయన అంత్యక్రియలు ప్రారంభం కానున్నాయి.