నాకు చెర్రీ కావాలి..! చెర్రీతోనే కొడతా..! పూజా ముద్దుల బిందె గిఫ్ట్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

అప్పట్లో అర్జున్ రెడ్డి ముద్దుల పోస్టర్ పై రేగిన దుమారంలో, బస్సులపై ఉన్న ఓ పోస్టర్ ని సినియర్ పొలిటీషియన్ వీ హెచ్ హనుమంతరావు చింపి నిరసన తెలిపాడు. అప్పుడు ఆయనకీ రౌడి ఫాన్స్ అందరు ‘ చిల్ తాత ‘ అంటూ బిరుదు ఇచ్చేసారు. నేటిజన్స్ కి మల్లి అలాంటి సంఘటన ఒకటి వాల్మీకి సాంగ్ లాంచ్ ఈవెంట్ లో చూసే అవకాశం వచ్చింది. తెలుగు సినిమాకి పూలు పళ్ళు నడుము వంటి గ్లామర్ ఎలిమెంట్స్ ని పరిచయం చేసిన సినియర్ డైరెక్టర్ రాఘవేంద్రరావు నిన్న రాత్రి తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ పూజా హెగ్డే తో మాట్లాడిన కొన్ని చిలిపి మాటలపై నేటిజన్స్ వేగంగా స్పందిస్తున్నారు.

వేదికలపై తక్కువగా మాట్లాడే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కి మౌనముని అనే బిరుదు ఉన్న సంగతి తెలిసిందే. అప్పటి వరకూ దర్శకేంద్రుడు మాట్లాడటం చూడని వారందరికీ ఈటీవిలో వచ్చిన ఓ షో ఈ మౌనముని మాటలను వినిపించింది. ఇక అక్కడి నుంచి రాఘవేంద్రరావు ఏదైనా సినిమా ఈవెంట్ కి వచ్చిన ప్రతీ సారి చమత్కారంతో రొమాంటిక్ యాంగిల్ లో మాట్లాడుతూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. కొన్నిసార్లు శృతి మించిపోతున్నాడు కూడా. నిన్న జరిగిన ‘వాల్మీకి’ ప్రెస్ మీట్ లో మౌనముని మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

వేదికపై ‘ఎల్లువొచ్చి’ పాట గురించి మాట్లాడి తన మధురస్మృతులు గుర్తుచేసుకున్న దర్శకేంద్రుడు చివర్లో పూజా హెగ్డే నడుముపై పెట్టుకున్న బిందె కావాలంటూ ఆ బిందెను తనకి గిఫ్ట్ గా ఇవ్వాలని కోరాడు. దాంతో అందరూ మౌనముని చిలిపితనం చూసి నవ్వుకున్నారు. ఇక రాఘవేంద్రరావు రొమాంటిక్ టాక్ వింటూ హరీష్ శంకర్ కూడా లైన్ లోకి వచ్చి గురువు గారు ఇప్పుడు పూజా ని చూస్తే మీకు ఏ పండుతో కొట్టాలనిపిస్తుంది ? అంటూ సరదాగా అడిగాడు. ఇక అనుమానం లేకుండా చెర్రీ అయితే బాగుంటుంది అంటూ జవాబిచ్చారు మౌనముని. చివర్లో పూజా బిందేపై ముద్దు పెట్టి ఇస్తే దాన్ని కానుకగా స్వీకరించి తన్మయత్వానికి లోనయ్యారు రాఘవేంద్రరావు. ఈ వీడియో చుసిన నేటిజన్స్ అంత ..,ఈ వయసులో ఇంత ఎమోషన్ అవసరమా.., చిల్ తాత చిల్ అంటున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: