జనసేన పార్టీ కి సంబంధించిన 400 ట్వీట్టర్ ఖాతాలను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ విషయమే ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్. ఇక ఈ వ్యవహారం పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన స్టైల్ లో స్పందించాడు. జనం తో నిలబడి పోరాడటం తప్పా..? జనం కోసం పోరాటం చేయడం మేము చేసిన తప్పా అంటూ ట్విట్టర్ యజమాన్యాన్ని నిలదీశాడు. అసలు ఇలా ఎందుకు చేశారో అర్ధం కావడం లేదని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్ తన సొంత ట్వీట్టర్ ఖాతా నుండి ట్వీట్టర్ యాజమాన్యానికి ట్వీట్ చేశాడు.
వివరాల్లోకి వెళితే.. జనసేన పార్టీ కి చెందిన దాదాపుగా 400 ఖాతాలను ట్వీట్టర్ యాజమాన్యం రద్దు చేసింది. అందులో నిత్యం సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉండి, భారీ ఫాలోయింగ్ ఉన్న ట్రెండ్ పీఎస్ పీకే, పవనిజం నెట్ వర్క్, వరల్డ్ పీఎస్ పీకే ఫ్యాన్స్, దాస్ పీఎస్ పీకే వంటి ఖాతాలను కూడా బ్లాక్ చేసేసింది. దీనిపై స్పందించిన పవన్ కళ్యాణ్.. ట్వీట్టర్ యాజమాన్యాన్ని నిలదీశాడు.. రద్దు చేయడానికి గల కారణాలని వెంటనే తెలుపాలాని.. అనవసరంగా రద్దు చేసిన ఖాతాలని తిరిగి యాక్టివ్ చేయాలని ఆయన కోరారు. ఇక ఆయన ట్వీట్ చేయడంతో అభిమానులు భారీగా రీట్వీట్ చేస్తున్నారు. దీంతో ఈ విషయమై ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది.