తెలంగాణాలో యురేనియం తవ్వకాలపై పవన్ కళ్యాణ్ చేసిన పోరాటం అద్బుతమని చెప్పొచ్చు . తెలంగాణాలోని అన్ని రాజకీయ పార్టీలతో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టబోయే కొన్ని గంటల ముందే, సేవ్ నల్లమల్ల ఉద్యమంపై తెలంగాణా ప్రబుత్వం నుండి అసెంబ్లీలో ప్రకటన రావడం చూస్తుంటే పవన్ ఎఫ్ఫర్ట్స్ ని మెచ్చుకోక తప్పదు. నేతల మధ్య నిత్యం కుమ్ములాటలుండే కాంగ్రెస్స్ పార్టిలోని అగ్ర నాయకులని కూడా ఒకే వేదికపై తీసుకొచ్చి పవన్ చేసిన పోరాటం ఇప్పుడు కాంగ్రెస్స్ లో కొత్త చిచ్చుకి దారి తీసింది. పవన్ కళ్యాణ్ సమావేశానికి వెళ్ళిన పార్టి నేతలపై తెలంగాణా కాంగ్రెస్స్ ఇంచార్జ్ కుంతియ క్లాస్ పికినట్టు తెలుస్తుంది . అసలు పవన్ కల్యాణ్ ఎవరు? అతడికి ఉన్న స్థాయి ఎంత? అతడు పిలవగానే వీరు వెళ్లడం ఏమిటి? అంటూ ఆ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జి కుంతియా ఈ విషయంలో తమ నేతలను ముక్యంగా రేవంత్ ని ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది.
పవన్ కల్యాణ్ స్థాయి ఏమిటో ఓటర్లే చాటి చెప్పారు. రెండు చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసి – రెండు చోట్లా ఓడిపోయిన వ్యక్తి పవన్. ఇక ఎన్నికల్లో ఆయన పార్టీకి వచ్చిన ఓట్లు ఎన్నో కూడా అందరికీ తెలిసిందే. పవన్ కల్యాణ్ తో పోలిస్తే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎంత గొప్ప పరిస్థితిల్లో ఉందని రేవంత్ మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు కుంతియ క్లాస్ పీకడని తెలుస్తుంది . ఏది ఏమైనా .., ప్రతిపక్ష నాయకులు ఎంత గోల చేసి ప్రశ్నించిన .. ఎవరు ఏ పోరాటం చేసిన, ఎవ్వడికి సమాదానం చెప్పడానికి ఇష్టపడని కేసిఆర్ తోనే ఏకంగా అసెంబ్లీలో సమాదానం చెప్పేలా చేసిన సేవ్ నల్లమల్ల పోరాటం కాంగ్రెస్స్ లో పెద్ద చిచ్చు రేపినట్టే ఉంది. నిత్యం సొంత నాయకులే కుమ్ముకుంటూ పార్టీని చెడ్డపేరు తెస్తున్న సమయంలో, మొదటి సారి రేవంత్ , ఉత్తం , వీహెచ్ లాంటి అగ్ర నాయకత్వం ఒకటే స్టాండ్ పై ఉంటు కలిసి పోరాడటం పై , వారిని పోగిడి మరింత ప్రోత్సహించాల్సింది పోయి, కాంగ్రెస్ అధిష్టానం ఈగోకి పోయి ఇలా క్లాసులు పీకడం ఏంటని నేటిజన్స్ ప్రశ్నిస్తున్నారు .