ఫైటర్ జెట్ లో రక్షణ మంత్రి చక్కర్లు..! తేజాస్ నడపడం థ్రిల్లింగ్ ఉంది..!

Google+ Pinterest LinkedIn Tumblr +

భారత రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఫ్లైట్ ఎక్కారు..! కేంద్ర మంత్రి ఫ్లైట్ ఎక్కడంలో పెద్ద వింత ఏం ఉంది అని అనుకుంటున్నారా..? నిజంగానే ఆయన ఫ్లైట్ ఎక్కడంలో ఏం వింత లేదు కానీ ఆయన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన ఫైటర్ జెట్ ఎక్కారు. ఐ‌ఏ‌ఎఫ్ కమాండోలు ధరించే దుస్తులే ధరించి కొంతసేపు జెట్ ని నడిపారు. ఓ కమాండోలా తయారయ్యారు.. ఫైటర్ జెట్ ‘తేజస్’ ఎక్కి గాల్లో చక్కర్లు కొట్టారు.. ఆ దృశ్యాలను చూసిన అభిమానులు రాజకీయ నేతలు నెటిజన్లు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. రక్షణ మంత్రి అంటే ఇలా ఉండాలి అని ఆయనకి కితాబు ఇస్తున్నారు.

తలకు హెల్మెట్, ఆక్సిజన్ మాస్క్, జీ-సూట్ ధరించి ఓ పైలట్ లా తయారయ్యి బెంగళూరులోని హెచ్ ఏ ఎల్ విమానాశ్రయంలో తేలిక పాటి జెట్ అయిన ‘తేజస్’ ఎక్కారు. ముఖ్య పైలట్ తో కలిసి 30 నిమిషాల పాటు జెట్ నడిపారు. కొంత సేపు విమానాన్ని స్వయానా ఆయనే కంట్రోల్ కూడా చేశారు. ప్లేన్ నడపడం తనకి ఎంతో థ్రిల్ ని ఇచ్చిందని వెల్లడించారు. దేశీయంగా తయారైనందునే తాను తేజాస్ విమానాన్ని ఎంపిక చేసుకున్నట్టు ఆయన చెప్పారు. ఈ విధమైన విమానాలను కొనుగోలు చేసేందుకు ఆగ్నేయాసియా దేశాలు ఎంతో ఆసక్తి చూపుతున్నాయని అయన వెల్లడించారు. స్వయానా రక్షణ మంత్రిగా ఉన్న రాజ్ నాథ్ ప్లేన్ నడపడం తమకు ఎంతగానో స్ఫూర్తిని ఇచ్చిందని భారత ఎయిర్ ఫోర్స్ వెల్లడించింది.

Share.

Comments are closed.

%d bloggers like this: