Advertisements

సింగరేణి కార్మికులకు కేసీఆర్ తీపి కబురు..! అక్షరాల లక్ష..!

Google+ Pinterest LinkedIn Tumblr +

సింగరేణి కార్మికులకి తీయని కబురు చెప్పారు సీఎం కేసీఆర్. వారికి దసరా బోనస్ గా లక్ష రూపాయలు ఇస్తామని ఆయన ప్రకటించారు. ప్రతీ సంవత్సరం దసరా బోనస్ గా వాళ్ళకి ప్రభుత్వం కొంత దానాన్ని ఇస్తుంది అదే తరహాలో ఈసారి కూడా బోనస్ ఇవ్వనుంది. గత సమవత్సరం కన్నా ఈసారి 40 వేల రూపాయలు ఎక్కువగా ఇస్తునట్టు సీఎం తెలిపారు.

నేడు జరిగిన అసెంబ్లీ సమావేశం లో కేసీఆర్ ఈ కబురు అందించారు. ఆయన మాట్లాడుతూ.. సింగరేణి సంస్థ లాభాల్లో 28 శాతాన్ని కార్మికులకు బోనస్ గా అందజేస్తున్నట్టు తెలిపారు. పోయిన సారి ఇచ్చిన బోనస్ కంటే ఈసారి 40,530 రూపాయలు ఎక్కువగా ఇస్తునట్టు ఆయన తెలిపారు. ప్రతీ కార్మికుడికి 1,00,899 రూపాయలు బోనస్ గా వస్తుందని ఆయన ప్రకటించారు. గత ఐదేళ్లుగా సింగరేణి లాభాలు పెరుగుతున్నాయని చెప్పారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 1,565 కోట్ల లాభాన్ని ఆర్జించిందని తెలిపారు. ఉత్పత్తి, రవాణా, అమ్మకాలు, లాభాలు, టర్నోవర్ లో సింగరేణి ప్రగతిపథంలో దూసుకుపోతోందని. అందుకు కష్ట పడ్డ ప్రతీ కార్మికుడు ఈ బోనస్ కి అర్హుడని అందుకే వారికి ఈ కానుక అని ఆయన ప్రకటించారు.

Advertisements
Share.

Comments are closed.

%d bloggers like this: