సైరాపై సమంత ట్వీట్.., నవ్వులపాలైన సామ్ ….!

Google+ Pinterest LinkedIn Tumblr +

నిన్న అంగరంగ వైభవంగా ‘ సైరా ‘ టిజర్ లాంచ్ ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్ విడుదల చేసిన ఈ లేటెస్ట్ సైరా ట్రైలర్ నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ దూసుకుపోతుంది. అక్కడక్కడ నెగిటీవ్ విమర్శలు వచ్చినా…, దాదాపు ఈ ట్రైలర్ పై అందరు పాజిటివ్ గానే స్పందించారు. ఈ ట్రైలర్ పై సామాన్యులే కాకుండా ఎందరో సెలబ్రేటిలు కూడా స్పందిస్తున్న తరుణంలో అక్కినేని కోడలు సమంత కూడా సైరాను పొగుడుతూ ట్వీట్ చేయగా దానిపై నేటిజన్స్ నుండి కామెడి సెటైర్స్ పడుతున్నాయి. అయితే ఎవరు తనపై విమర్శలు చేసిన వెంటనే కౌంటర్ ఇచ్చే సమంత.. తనపై వచ్చిపడ్డ ఈ కామెంట్లకు కూడా సరైన సమాదానం చెప్పి అందరికి షాక్ ఇచ్చింది.

విజువల్ వండర్ లా ఉన్న సైరా లేటెస్ట్ ట్రైలర్ పై సమంత కూడా ప్రశంశలు గుప్పించింది. సైరాలోని ప్రతి షాట్ లో యూనిట్ సభ్యుల కష్టం, పనితనం కనిపిస్తున్నాయని పొగడ్తలు కురిపించింది. అయితే ఈ ట్వీట్ పై సుమ్ము అనే ట్విట్టర్ అకౌంట్ నుండి సెటైర్ పడింది. “ అసలు దీనికి ఇందులో ఎం అర్ధం అయిందో “ అంటూ వచ్చిన ఈ ట్వీట్ పై సమంత స్పందిస్తూ “ నీ కంటే కూడా చాల బాగా అర్ధం అయింది పిల్ల “ అంటూ రీ ట్వీట్ చేసింది సమంత. అయితే సమంత చేసిన ఈ ట్వీట్ పై రకరకాల విమర్శలు వస్తున్నాయి. సుమ్ము అనే ట్విట్టర్ అకౌంట్ కి సమంత ఫొటోనే ఉన్నా , అది అమ్మాయి కాదని , ఆ అకౌంట్ అబ్బాయి దే అంటూ, సమంత కనీసం అదికూడా తెలుసుకోలేకపోతుంది అంటూ నేటిజన్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: