కోర్టుకెక్కిన కాంట్రవర్సీ..! దెబ్బకి ‘వాల్మీకి’ సినిమా టైటిల్ చేంజ్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

భారీ అంచనాలతో నిర్మించిన సినిమా వాల్మీకి.. కొంత కాలంగా విమర్శల నడుమ కొట్టుమిట్టులాడుతుంది. ఎటు చూసినా వాల్మీకీ సినిమా గురించే చర్చ. ఈ సినిమా రిలీజ్ కి ముందే సంచలనంగా మారింది. ఎటు చూసినా వాల్మీకి టైటిల్ గురించి ఒకటే రబస. వాల్మీకీ ఒక బోయవాడు..! పైగా గొప్ప మహర్షి కారణజన్ముడు..! కానీ ఈ సినిమాలో ఒక పెద్ద విలన్ నెగిటివ్ షేడ్స్ ఉన్న ఓ రౌడీ..! ఒక నెగిటివ్ షెడ్ ఉన్న సినిమాకి మహనీయుడి పేరు పెట్టడంతో తెగ కాంట్రవెర్సీగా మారింది.

రౌడీల సినిమాలు తీస్తూ వాల్మీకి అనే టైటిల్ ని ఎలా పెట్టారు మా మనోభావాలు దెబ్బ తింటున్నాయి అని కొన్ని కులాల వారు వాదిస్తున్నారు. ఇక చిత్ర యూనిట్ వాల్మీకి ఒక గొప్ప వాడు కాబట్టి మా సినిమాకి ఆయన పేరుని పెట్టుకున్నాము సినిమా లోని విలన్ కూడా ముందు పెద్ద విలన్ నుండి ఓ మంచి వాడు అవుతాడు అందుకే ఆ టైటిల్ ని ఎంచుకున్నాము అని చెబుతున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్రంగా ఘర్షణలు మొదలయ్యాయి. విషయం కోర్టు మెట్లు కూడా ఎక్కేసింది.

వెంటనే టైటిల్ ని మార్చాలి లేకుంటే సినిమాని అడ్డుకుంటాము అని బొయ్త సంఘాలు కోర్టు ని ఆశ్రయించాయి. టైటిల్ మార్పుపై హైకోర్టులో పిటీషన్ దాఖలు చేయగా చిత్రా టైటిల్ ని వెంటనే మార్చాలంటూ హై కోర్ట్ చిత్ర యూనిట్ కి నోటీసులు పంపింది. దీంతో చిత్ర నిర్మాణ సంస్థ దెబ్బకి తోక ముడిచింది. ప్రస్తుతం ఉన్న టైటిల్ వాల్మీకి ని ‘గద్దలకొండ గణేష్’ గా మారుస్తునట్టుగా నిర్మాణ సంస్థ 14 రీల్స్ అధికారి ప్రకటన చేసింది. ఇప్పటికైనా ఆ సంఘాలు నిరసన మానుకుంటాయా లేక సినిమా ని అడ్డుకుంటాయా అనే విషయం తేలాలంటే వేచి చూడాలి.

Share.

Comments are closed.

%d bloggers like this: