ప్రిన్సిపాల్ కామం…కోరిక తీరిస్తేనే పాస్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

రోజురోజుకి సమాజంలో మహిళలకు భద్రత కరువవుతుంది. సొంతవాళ్ళు, పరాయివాళ్ళు, చదువు చెప్పేవాళ్ళు ఇలా ఒకరేంటి ఎవడు పడితే వాడు ఆడవాళ్లపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ప్రపంచ నలుమూలల ఎక్కడో ఒక చోట ప్రతీ రోజు ఆడవారిపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా…ఓ కీచక ప్రిన్సిపాల్ తన విద్యార్థినిపై కన్నేసి…తన కోరిక తీరిస్తేనే పరీక్షల్లో పాస్ చేయిస్తానని.. లేకుంటే జీవితాన్ని నాశనం చేయిస్తానని బెదరించాడు. ఈ దారుణమైన ఘటన చిలీపట్నంలో జరిగింది. వివరాల్లోకి వెళితే..మచిలీపట్నం గ్రేస్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్‌లో ఓ యువతి బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. భవిష్యత్‌తో ఉన్నత స్థానానికి వెళ్లాలన్న లక్ష్యంతో చదువుకుంటోంది. అలాంటి ఆ విద్యార్థినిపై కాలేజీ ప్రిన్సిపాల్ రమేష్ కన్నేశాడు. తన లైంగిక కోరికలు తీర్చితేనే పరీక్షల్లో పాస్ చేయిస్తానని.. లేకుంటే జీవితాన్నే నాశనం చేయిస్తానని బ్లాక్‌మెయిల్ చేశాడు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులతో చెప్పింది బాధితురాలు. తన కూతురు పరిస్థితి చూసి తండ్రి కుప్పకూలిపోయాడు. ప్రిన్సిపాల్ వ్యవహారం విద్యార్థి సంఘాలకు తెలియడంతో.. బాధితురాలితో కలిసి ఆందోళన చేపట్టాయి. ప్రిన్సిపాల్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

Share.

Comments are closed.

%d bloggers like this: