ఒక్క సీటు..! ఇద్దరు నేతలు..! కాంగ్రెస్ పార్టీ ముక్కలు ముక్కలు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

హుజూర్ నగర్..! తెలంగాణ రాజకీయాల్లో తెలంగాణ రాష్ట్రం లోని హుజూర్ నగర్ నియోజకవర్గమే ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్..! గత సార్వత్రిక ఎన్నికల్లో హుజూర్ నగర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే గా పోటీ చేసి స్వల్ప మెజారిటీతో గెలిచారు కాంగ్రెస్ తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉత్తమ్ కుమార్ కి హుజూర్ నగర్ లో మంచి ఓట్ బ్యాంక్ ఉంది అనడంలో అతిశయోక్తేమి లేదు. ఇక ఎమ్మెల్యే ఎన్నికల తరువాత ఎంపీ ఎన్నికలు జరిగాయి.. ఎంపీ ఎన్నికల్లోనూ ఉత్తమ్ కుమార్ పోటీ చేశాడు.. నల్గొండ నుండి పోటీ చేసిన ఆయన ఈ ఎన్నికల్లో కూడా గెలుపొందారు.

ఒకే సారి ఎమ్మెల్యే గా ఎంపీ గా ఉండటం రాజ్యాంగంగా విరుద్దం.. దీంతో ఆయన హుజూర్ నగర్ నుండి గెలుపొందిన ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేశారు.. ఇక ఆ స్థానం కాళి అయ్యేసరికి అక్కడ ఉప ఎన్నికలు జరగడం అనివార్యం..! ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టాలి.. ఆ స్థానానికి ఎవరు అర్హులు అనే విషయం పై తెలంగాణ కాంగ్రెస్ లో భారీ చర్చలు నేతల మధ్య వాగ్వాదాలు.. సెగలు..! మరోపక్క కాంగ్రెస్ పార్టీ లోకి కొత్తగా వచ్చి మల్కాజ్ గిరి నుండి ఎంపీ గా పోటీ చేసి గెలిచిన రేవంత్ రెడ్డి ఇప్పుడు పీసీసీ చీఫ్ పదవి రేస్ లో ముందంజ లో ఉన్నాడు.. పార్టీ ఆయనకి కొత్తగా వచ్చినప్పటికీ మంచి మర్యాదని ఇవ్వడం తో ఆయన కొంత మేరకు నోరు పారేసుకుంటున్నాడు..! ఎక్కడ ఉన్న ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా రేవంత్ తన గళం తో తన ఉనికిని చాటుకుంటున్న విషయం మనకి తెలిసిందే.. గతంలో కూడా రేవంత్ అలా చేయడం మనం చూసాము.. !

పీసీసీ పదవి రేస్ లో రేవంత్ ఉత్తమ్ కుమార్ ఇద్దరు సమంగా ఉన్నారు.. దీంతో ఇద్దరిలో కొంతకాలంగా రాజకీయ విరుద్దాలు ఏర్పడ్డాయి. ఒకరిపై ఒకరు విమర్శలు చేవ్సుకోడం కూడా మనం చూసాము.. ఇక ఇలాంటి సమయంలోనే హుజూర్ నగర్ ఉపయెన్నికలు రావడంతో ఈ వాగ్వాదాలు మరింత పెరిగాయి. ఇద్దరు వేర్వేరు పేర్లను సజెస్ట్ చేయడంతో ఇద్దరి మధ్యలో మాటల యుద్ధాలు..! ఉత్తమ్ కుమార్.. తన భార్య పద్మావతిని సజెస్ట్ చేశాడు.. ఇక రేవంత్ మాత్రం ఇందుకు ససేమిరా అంటున్నాడు.. ఆమెకు బదులుగా యూత్ కాంగ్రెస్ లీడర్ చామల కిరణ్ కుమార్ రెడ్డి ని సజెస్ట్ చేశాడు. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్దాలు జరుగుతున్నాయి. తన ఇష్ట పూర్వకంగా ఎలాంటి నివేదిక ఇవ్వకుండా ఉత్తమ్ తన భార్య పేరు ని ఎలా ఖరారు చేస్తారు..! తమాషాగా ఉందా అంటూ వ్యాఖ్యలు చేశాడు.. ఉత్తమ్ కు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇద్దరికీ మద్దత్తుగా కొందరు నేతలు చేరడంతో చిన్న విషయం కాస్త కాంగ్రెస్ వర్గపోరు లా మారింది. కాంగ్రెస్ ఇరు వర్గాలుగా చీలిపోతుందేమో అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

ఇద్దరు సములుగా ఉన్నప్పటికీ.. కాంగ్రెస్ లో సీనియర్ నేతగా ఉన్న ఉత్తమ్ కె కొంత ఎక్కువ మద్దత్తు దక్కుతుంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్లు ఉత్తమ్ కె అండగా నిలుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ. హనుమంత్ రావు రేవంత్ పై విమర్శలు చేస్తున్నారు. మరో పక్క భువనగిరి కాంగ్రెస్ ఎంపీ గా గెలిచిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రేవంత్ పై కొత్తగా పార్టీ లోకి వచ్చిన వాళ్ళు కూడా ఎక్కువగా మాట్లాడుతున్నారు.. మీ సలహాలు తీసుకోడానికి మేము సిద్ధంగా లేము అని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశాడు.. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి రేవంత్ పై ప్రస్తావిస్తూ.. పీసీసీ రేస్ లో ఉన్నావు.. ఎందుకు ఇలాంటి విమర్శలు చేసి వెనక్కి వెళతావు అని రేవంత్ కి సలహాలు ఇస్తున్నాడు. ఇక సీనియర్ లీడర్లు జానా రెడ్డి హనుమంత్ రావు రేవంత్ వ్యాఖ్యలను కుంటియా దృష్టి కి కాంగ్రెస్ డిసిప్లేన్ కమిటీ దృష్టి కి తీసుకెళ్లి రేవంత్ పై హై కామాండ్ నుండి వత్తిడి తేడానికి ట్రై చేస్తున్నారు. మరోపక్క సేవ్ నల్లమల్ల అంటూ రేవంత్ తనకి దొరికిన ప్రతీ ప్లాట్ ఫామ్ నిరసనలు చేస్తూ ఆ విషయాన్ని ఎంతో పుష్ చేసి.. సెంట్రల్ దృష్టికి తీసుకెళ్లి దాన్ని నేషనల్ ఇష్యూ గా మార్చడానికి ట్రై చేస్తూ సెంట్రల్ దృష్టిని ఆకట్టుకుంటున్నాడు. ఎవరి వాదన నెగ్గుతుందో తెలీదు కానీ రాజకీయం మాత్రం భగ్గుమంటుంది. ఇవన్నీ చూస్తుంటే నేతలు తమ పదవి వ్యామోహాల కోసం పార్టీని రెండు ముక్కలుగా చీలుస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: