ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డీ కి టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాశారు.. జగన్ అధికారం లోకి వచ్చిన తరువాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నో సమస్యలు అనుభవించారని వారి సమస్యలని ముఖ్యంగా లేఖ లో ప్రస్తావించారు. నాలుగు నెలలకే ప్రజలు ఎంతగానో కష్టాలు పడ్డారని ఆయన లేఖ లో రాశారు. సరైన అనుభవం లేక అనుభవ రాహిత్యంతో, ఆశ్రిత పక్షపాతంతో, కక్ష సాధింపు వైఖరి తో పాలన చేస్తున్నారని ఆయన లేఖ లో పేర్కొన్నారు. ఇందుకు నిదర్శనంగా సచివాలయ పరీక్ష ఫలితాల్లో జరిగిన అవకతవకలను బాబు గుర్తు చేశారు. మీ బ్రష్టు పాలనతో ఏపీపీఎస్సీ ప్రతిష్టకే మచ్చ తెచ్చారని ఆయన మండిపడ్డారు.
మీ బంధువులకి మీ కుటుంభ సభ్యులకి పేపర్ లీక్ చేసి వారికే ఉద్యోగాలు తెప్పించారని.. 19 లక్షల కుటుంబాలకు తీరని ఆవేదన మిగిల్చారని బాబు ప్రభుత్వం పై మండిపడ్డారు. ప్రశ్నపత్రాలు పరీక్ష కన్నా ముందే విశ్రాంత అధికారికి ఎలా చేరిందని ఆయన నిలదీశారు. మీరు గతంలో చేసిన వ్యాఖ్యల ఆధారంగా ఘటనకు భాధ్యత వహించి మీ పదవికి రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. పరీక్ష ని పూర్తిగా రద్దు చేసి మరోసారి పరీక్ష నిర్వహించి సరైన అరుహాలకే ఉద్యోగాలు అందేలా చూడటం ప్రభుత్వ కర్తవ్యం అని బాబు గుర్తు చేశారు. నష్టపోయిన అభ్యర్థులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ నీచపు చర్యకి బాధ్యులైన ప్రతీ ఒక్కరి పై క్రిమినల్ కేసు పెట్టి బాధితులని ఆడుకోవాలని ప్రభుత్వాన్ని లేఖ ద్వారా కోరారు.