తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులు సీఎం కేసీఆర్ సీఎం జగన్ నేడు హైదరబాద్ లోని ప్రగతి భవన్ లో భేటీ కానున్నారు..! గోదావరి కృష్ణ నదుల అనుసందానం విభజన సమయంలో సద్దుకొని విషయాల పై కీలకంగా చర్చించనున్నారు. భేటీ లో ముఖ్యమంత్రులతో పాటు రాష్ట్ర మంత్రులు ప్రాజెక్ట్ ఇంజనీర్లు కూడా పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాతా తొలిసారిగా జూన్ 28 న తెలంగాణ సీఎం కేసీఆర్ తో భేటీ ఆయ్యాడు. ఆ సమయంలో కూడా ఇరు సీఎం ల మధ్య గోదావరి కృష్ణ జలాల అనుసందానం గురించే ప్రధానంగా చర్చ జరిగింది. ఇక ఈసారి కూడా ఇదే అంశం ప్రధానం అవ్వనుంది. విభజన సమస్యలు, తెలుగు రాష్ట్రాల పై సెంట్రల్ చూపుతున్న వైఖరి పై చర్చించనున్నారు.
ఈ నేపద్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి నుండి తన మంత్రులతో సలహాదారులతో ఇంజనీర్లతో కలిసి బయలుదేరి ఉదయం 11.30 గంటలకు హైదరబాద్ లోని తన నివాసం అయిన లోటస్ పాండ్ కు చేరుకుంటారు. ఇక అక్కడనుండి నేరుగా ప్రగతి భవన్ చేరుకొని సీఎం కేసీఆర్ తో భేటీ కానున్నారు. సీఎం కేసీఆర్ తో లంచ్ చేసి ఆపై భేటీ కొనసాగించనున్నారు. గదావరి కృష్ణ జలాల సంపూర్ణ వినియోగం విభజన అంశాలపై చర్చించనున్నారు. తొమ్మిది, పదో షెడ్యూలులోని అంశాలపై ఇప్పటికే సీఎంల మధ్య అనేక సార్లు చర్చలు జరిగాయి. ఇక ఇదే నేపద్యం లో నేడు మరోసారి చర్చించనున్నారు. మొత్తానికి ఇరు రాష్ట్రాల మధ్య స్నేహ పూర్వక బంధం పెరగడానికి ఇద్దరూ ముఖ్యమంత్రులు మడుగులు తొక్కుతున్నారు అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరు ముఖ్యమంత్రులు పరస్పరంగా పని చేస్తున్నారు. ఒకరి సలహా ఒకరు తీసుకుంటున్నారు.. ఆంధ్రప్రదేశ్ లోని నూతున ఇసుక పాలసీ ని డిజైన్ చేసింది కుండా తెలంగాణ మంత్రులే కావడం గమనార్హం..!