రాజమౌళి పై పవన్ కళ్యాణ్ పవర్ పంచ్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహా రెడ్డి ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కాసేపు మాట్లాడారు. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలను గుర్తు చేసుకొని ఆవేదన చెందారు. అలాగే ఏ నటుడి అనుభవాన్ని తాను తక్కువగా చూడనని చెప్పారు. మా అన్నయ్య మాకు సీనియర్లను గౌరవించే సంస్కారం నేర్పారని పవన్ చెప్పడం జరిగింది. ఈ సందర్బంగా పక్కనే ఉన్న రాజమౌళి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసాడు.

మా అన్నయ మాకు అభిమానించటం ఒక్కటే నేర్పడాని, ఏ హీరో సినిమాలు విడుదలైనా… ఇంకే దర్శకుడి సినిమా హిట్ అయినా మేము ఆనంద పడతామని, అసూయా చెందమని అన్నాడు. రాజమౌళి గారు ప్రపంచ స్తాయి దర్శకుడని.. దేశం గర్వించే సినిమాలు తీస్తాడని, ఆయన డైరెక్ట్ చేసిన ఏ సినిమా హిట్ అయినా మేము అసూయా పడమని చెప్పడాని ఇప్పుడు కొందరు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మగదీర టైంలో మెగా ఫ్యామిలికి, రాజమౌళికి క్రెడిట్ వార్ నడించిన విషయం తెలిసిందే. మగ దీర విజయం తరువాత రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ వల్లే సినిమా హిట్ అయింది అంటూ.. మెగా ఫ్యామిలీ చరణ్ ని ఎక్కువగా ప్రమోట్ చేసి రాజమౌళిని పట్టించుకోలేదన్నది అప్పట్లో చర్చనియంశం అయింది…ఈ విషయంలో, అలాంటి గొడవలు ఏమికాలేదని రాజమౌళి ఎన్నోసార్లు వివరణ కూడా ఇచ్చాడు.

అయితే పవన్ కూడా ఎన్నోసార్లు మగదీరని, అందులో చరణ్ నటనను మెచ్చుకున్నాడు. బాహుబలి లాంటి ప్రపంచ స్థాయి సినిమాను రాజమౌళి తీసినా, రాజమౌళి కెరీర్లో మగదీరనే ఉత్తమ చిత్రం అన్నట్టు పలుసార్లు కామెంట్స్ చేసాడు పవన్. అది ప్రభాస్ సినిమా కావడంతోనే బాహుబలిని ఎక్కువగా పవన్ పొగిడాడు అన్న వదంతులకు చెక్ పెట్టడానికే, రాజమౌళి వేరే హీరోస్ తో హిట్స్ కొట్టినా మేము అసూయా పడమని అర్ధం వచ్చేలా మాట్లాడాడు అని కొందరు నేటిజన్స్ అంటున్నారు. ఏది ఏమైనా పవన్ లాంటి వ్యక్తి నిజంగానే అందరి సక్సెస్ ని తన సక్సెస్ గా భావిస్తాడు అని చెప్పటంలో ఏలాంటి సందేహం లేదు. అయినా కూడా పవన్ పై క్రిటిసైజ్ చేసే వాళ్ళందరికీ సైరా ఈవెంట్ సాక్షిగా పవన్ కౌంటర్ ఇవ్వడం ఇప్పుడు చర్చకు తావు తీసింది.

Share.

Comments are closed.

%d bloggers like this: