విజయ్ ని హరీష్ శంకర్ అంత మాట అనేసాడా….!

Google+ Pinterest LinkedIn Tumblr +

గద్దెల కొండ గణేష్ విజయంతో రిమేక్ స్పెషలిస్టుగా పేరు తెచ్చుకున్నాడు హరీష్ శంకర్. విడుదలకు ముందు ఎన్ని వివాదాలు వచ్చిన, ఎంతో కాన్ఫిడెంట్ గా సినిమా కొట్టి మల్లి ఫారం లోకి వచ్చిన హరీష్ శంకర్ ,పలు ప్రమోషినల్ ఈవెంట్స్ లో ఆసక్తికర వ్యాక్యాలు చేస్తు హాట్ టాపిక్ గా నిలుస్తున్నాడు. ఒక మీడియా చానెల్ తో మాట్లడుతూ విజయ్ దేవరకొండపై పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసాడు హరీష్ శంకర్. పలువురు టాలివుడ్ స్టార్ హీరోలపై సింగిల్ లైన్ స్టేట్మెంట్ ఇవ్వాలని యాంకర్ అడిగిన హీరోలా గురించి హరీష్ శంకర్ మాట్లడుతూ..

ఎన్టీఆర్‌‌లో సింగల్ టేక్ ఆర్టిస్ట్.. ఆయనలో నచ్చనది టైం అంటే టైం. షూటింగ్‌ 8 గంటలంటే పది నిమిషాలు ముందు వచ్చేస్తారు. పవన్ కళ్యాణ్ ఒక ఆరా.. ఆయనలో నచ్చనిది ఆయన సినిమాలు చేయననటం. మెగాస్టార్ చిరంజీవి అంటే కింగ్ ఆఫ్ సినిమా. ఇంకో చిరంజీవి పుడతారని అనుకోను. చిరంజీవితో అవకాశం వస్తే.. దొంగమొగుడు, రౌడీ అల్లుడు లాంటి చిత్రాలనే చేస్తా.
విజయ్ దేవరకొండ.. యూత్ ఐకాన్. అర్జున్ రెడ్డి సినిమా తరువాత విజయ్‌కి కథ చెబుదాం ఒకసారి కలుద్దాం అని మెసేజ్ పెట్టా. అన్నా.. నేను ఏడాదిన్నర- రెండేళ్ల వరకూ బిజీగా ఉన్నాను. సినిమా టాపిక్ కాకపోతే కలుద్దాం అని మెసేజ్ పెట్టాడు. సినిమా టాపిక్‌ కాకపోతే నీతో నాకు పనేం ఉంటుంది భయ్యా.. ఏడాదిన్నర తరువాతే కలుద్దాం అని నేను రిప్లై ఇచ్చా. అతని గురించి నెగిటివ్ చెప్పాలంటే.. అతను విమర్శను చాలా సీరియస్‌గా తీసుకుంటున్నాడు. మన పని మనం చూసుకుని వెళిపోతే సరిపోద్ది. నాని వెరీ ఎక్స్‌ప్రెసివ్… రవితేజ నా లైఫ్. ఆయన లేకుండా నా లైఫ్‌ని ఊహించుకోలేను. జీవితం పట్ల, సినిమా పట్ల ఫుల్ క్లారిటీతో ఉంటాడు. రవితేజలో నెగిటివ్ అని చెప్పలేం. రామ్ చరణ్.. పవర్ హౌస్‌ లాంటి వాడు. చిరుతలో చూసిన చరణ్‌కి రంగస్థలంలో చరణ్‌కి చాలా తేడా ఉంది. ఇన్‌స్పిరేషన్ అతను. సాయి ధరమ్ తేజ్‌ అంటే నాకు చాలా ఇష్టం. అతనితో సినిమా చేస్తున్నప్పుడు కొన్ని కొన్ని షాట్‌లలో అలా చిరంజీవి కనిపిస్తాడని,ఇక వరుణ్ తేజ్ ఇండియా లెవల్లో ఎదిగే అర్హతలున్న హీరో అంటూ చెప్పుకొచ్చాడు .

Share.

Comments are closed.

%d bloggers like this: