వేణు మాధవ్ చివరి యాత్ర..! స్వగ్రామం లోనే అంత్యక్రియలు..

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రముఖ హాస్యనటుడు.. టైమింగ్ తో పంచులు వేయడంలో దిట్ట.. తాను స్క్రీన్ పైకి వస్తే ఇక నవ్వులే నవ్వులు..! అలాంటి హాస్యనటుడు వేణు మాధవ్ మరణంతో తెలుగు ప్రజలు తెలుగు సినీ పరిశ్రమ విషాదం లోకి మునిగిపోయింది. ఆయన మృత్యువుతో విషాద ఛాయలు వెల్లువెత్తాయి. సరిగ్గా తన జీవితంలో 39 ఏళ్ళు గడిచిన వెంటనే ఆయన తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. బుధవారం మధ్యాహ్నం 12.20 గంటలకు ఆయన కన్నుమూశారు. ఇక నేడు ఆయన స్వగ్రామం అయిన మౌలాలి లో అత్యక్రియలు జరుగనున్నాయి. అభిమానులు ఆయనని చివరిసారిగా చూడటానికి పార్థివ దేహాన్ని ఫిల్మ్ ఛాంబర్ లో ఉంచారు.

వేణు మాధవ్ కు తన స్వగ్రామం అంటే అమితమైన ప్రేమ. ఆయన సినిమాల్లోకి వచ్చిన తరువాత కూడా తాను పుట్టి పెరిగిన ఊరిని వదలలేదు. అక్కడే తన నివాసాన్ని ఏర్పరుచుకొని ఉంటున్నారు. ఇక ఆయనకి ఇష్టమైన స్వగ్రామం నుండే ఆయన చివరి యాత్ర జరుపుకుంటున్నారు. తన స్వగ్రామం లోనే ఆయన అంత్యక్రియలు జరుగనున్నాయి. మిమిక్రీ ఆర్టిస్ట్ గా తన జీవితాన్ని ప్రారంభించుకున్న వేణు మాధవ్ ఆపై సినిమాల్లోకి వచ్చి మచి కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. నటుడిగా వేణు మాధవ్ మంచి గుర్తింపు పొందారు ఆయన నటించిన లక్ష్మీ సినిమాకి ఉత్తమ కమేడియన్ అవార్డ్ కేటగిరీలో నందీ అవార్డ్ పొందారు.. ఇక దిల్ సై వంటి సినిమాలకి సినీమా అవార్డులు దక్కించుకున్నారు. టీడీపీ వ్యవస్థాపకుడు సీనియర్ ఎన్టీఆర్ ఆధ్వర్యంలో ఆయన తెలుగు దేశం పార్టీలో చెరీ అక్కడ కూడా పని చేశారు.. అప్పటినుండి టీడీపీ పార్టీ లోనే ఉంటూ వచ్చారు. ఇక ఇప్పుడు ఆయన మరణంతో అటు రాజకీయ వర్గాలు ప్రజలు మరోపక్క సినీ పరిశ్రమ విషాద సంద్రంలో మునిగిపోయాయి.

Share.

Comments are closed.

%d bloggers like this: