సైరాపై వర్మ సెటైర్స్ …..!

Google+ Pinterest LinkedIn Tumblr +

అర్దరాత్రి వోడ్కా ట్వీట్స్ తో గిల్లికజ్జాలు పెట్టుకోవడం వర్మకు సరద. రాత్రి అయిందంటే ఆయన ఎవరిపై ఎలా పడతాడో, ఆయన ఆకలికి ఎవరు బలైతారో తెలీని పరిస్థితి. కానీ వర్మ ట్వీట్ , ఆయన ప్రత్యర్దుల గుండెలకు ఎంత నోచ్చుకునేలా ఉన్నా, అందులో లోతైనా అర్ధం ఉంటుంది అంటుంటారు. వర్మ బయం లేకుండా చెప్పే నిజమ్ అంటూ ఆయన అబిమానులు వర్మ లేట్ నైట్ ట్వీట్స్ కోసం ఎదురుచూస్తుంటారు. ఇక వర్మ తాజాగా ‘సైరా’ సెకండ్ ట్రైలర్ పైన స్పందించారు. మెగా ఫ్యామిలీ పై కొంచం గురి ఎక్కువుండే వర్మ , సైరా ట్రైలర్ పై ఎలా స్పందిస్తాడో అని చాల మందే ఎదురుచూస్తున్నా సమయంలో ఆ ట్వీట్ రానే వచ్చేసింది . అయితే ఈ ట్వీట్ లో వర్మ శైలి మిస్ అయింది. దీంతో సోషల్ మీడియాలో కలకలం రేగింది.

సైరా సెకండ్ ట్రైలర్ ను షేర్ చేస్తూ వర్మ “వావ్. మెగాస్టార్ చిరంజీవి గారికి సరిగ్గా సరిపోయే సినిమా ‘సైరా’. నిర్మాత రామ్ చరణ్ అటు నాన్నగారు చిరంజీవికి.. ఇటు ప్రేక్షకులకు ఇచ్చిన బహుమతి” అంటూ ఒక సగటు చిరు అభిమాని తరహాలో ఎంతో హుందాగా స్పందించాడు. సరిగ్గా ఇక్కడే వచ్చింది చిక్కు. వీలైనంతగా విమర్శలు చేసే వర్మ ఇలా పాజిటివ్ గా స్పందించడంతో నెటిజన్ల ఫ్యూజులు ఎగిరిపోయాయి. వింత వింత కామెంట్లతో సందడి చేశారు. ఒకరేమో ఇది మార్నింగ్ ట్వీట్ .. ఆఫ్టర్ 9 పీఎమ్ కొత్త వెర్షన్ వస్తుంది అంటుంటే, ఇంకోరేమో కాసేపు అయ్యాక.. నా ఖాతా హ్యాక్ చేశాడని అంటాడేమో గురుడు, అంటుండగా “ చుక్క పడక ముందు ఇలా.. పడితే మారుతుందేమో” అంటూ ఎవరికీ తోచిన రీతిలో వారు వర్మపై వ్యంగ్యాస్త్రాలు పడుతున్నాయి. ఏది ఏమైనా నిత్యం అందరిపై సెటైర్లు పేల్చే వర్మ ట్వీట్ పైనే తొలిసారి రివర్స్ సెటైర్స్ పడటం గమనార్హం.

Share.

Comments are closed.

%d bloggers like this: