సైరా దుబాయ్ రివ్యూ..! మెగా ఫాన్స్ కి షాక్….!

Google+ Pinterest LinkedIn Tumblr +

మెగాస్టార్ చిరంజీవి నటించిన భారీ బడ్జెట్ చిత్రం సైరా మరో రెండు రోజుల్లో థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ , ట్రైలర్లు ,టైటిల్ సాంగ్ చిత్రంపై భారీ అంచనాలను తీసుకొచ్చాయి. మెగా ఫామిలీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ విడుదలకి రెండు రోజులముందే సినిమా టాక్ పై కొన్ని హింట్స్ సోషల్ మీడియాలో వచ్చే స్త్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ రివ్యూ అండ్ టాక్ ని, దుబాయ్ టాప్ ఇండియన్ డిస్ట్రిబ్యూటర్ ఉమైర్ సంధూ తన ట్విట్టర్ లో ప్రకటించటంతో మెగా ఫాన్స్ మరియు మెగా సోషల్ మీడియా టీమ్ దీన్ని ప్రమోట్ చేస్కునే పనిలో పడ్డారు.

సైరా చిత్రం భారీ అంచనాల నడుమ అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. మొదటి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా సినిమా రూపొందటంతో అన్ని భాషల్లోనూ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే దుబాయ్ లో ఈ సినిమా హక్కులను కొనుకున్న ఫేమస్ ఇండియన్ డిస్ట్రిబ్యూటర్ ఉమైర్ సందు ఈ సినిమా చూసి తన అభిప్రాయాన్ని పంచుకోవడం జరిగింది. ఇండియాలోని అన్ని భాషల సినిమాలను చూసి , ముందే టాక్ గురించి చెప్పడం వళ్ళ ఇతని వ్యాఖ్యలకు మీడియాలో ఎంతో పాదాన్యం వస్తు ఉంటుంది. అలాంటి ఈయన సైరా పై మెగా ఫాన్స్ తొడకొట్టే వ్యాఖ్యలే చేసేసాడు.

సైరా సినిమా సూపర్ గా ఉందని, మేకింగ్, మెగాస్టార్ నటన, స్క్రీన్ ప్లే అన్ని సినిమాకు ప్లస్ అయ్యాయని, బాక్సాఫీస్ దగ్గర రికార్డులు కొల్లగొట్టటం ఖాయం అని ట్వీట్ చేశారు. మెగాస్టార్ తో పాటు అమితాబ్, సుదీప్ లు నటనతో ఆకట్టుకున్నట్టు ఉమైర్ ట్విట్టర్ లో పేర్కొన్నాడు. డైరెక్టర్, స్క్రీన్ ప్లే, సౌండ్ ట్రాక్, అన్ని సినిమాకు ప్లస్ అయ్యాయని 4 రేటింగ్ ఇస్తున్నట్టు ఉమైర్ సంధూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. కాగా, ఇతడు గతంలో ‘సాహో’ సినిమాకి కూడా ఇలానే రివ్యూ ఇచ్చాడు. కాని దాని ఫలితం ఏమైందో అందరికి తెలిసిందే. ఇక ఈ సినిమాకి ఫోర్ రేటింగ్ ఇస్తూ ఉమైర్ సందు చేసిన ట్వీట్ ఎంతవరకు నిజమవుతుందో సైరా విడుదల అయ్యాక కాని చెప్పలేం.

Share.

Comments are closed.

%d bloggers like this: