ఆసక్తి రేపుతున్న ఆవిరి టిజర్-3….!

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రయోగాత్మక చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రెస్స్ రవిబాబు. హిట్స్ ఫ్లాప్స్ కి సంబంధం లేకుండా తనకంటూ ప్రత్యెక ఇమేజిని సొంతం చేసుకున్న రవి బాబు దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘ఆవిరి’. ఈ మధ్యే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కొద్దిరోజుల క్రితం ఆవిరి టీజర్ 1 రిలీజ్ చేశారు. తర్వాత ఆవిరి టీజర్ 2 రిలీజ్ చేశారు. తాజాగా ఆవిరి టీజర్ 3 రిలీజ్ చేశారు. ఇలా వరుసగా ఆవిరి 1 ఆవిరి 2 ఆవిరి 3…. అని చదువుతూ పోతుంటే మనకు ఎలా ఉంటుందో టీజర్ కూడా అలానే ఉంది. సహజంగా ఏ సినిమాకి అయినా టిజర్ ట్రైలర్ థియరిటికల్ ట్రైలర్ అంటూ మూడు ట్రైలర్స్ కట్ చేస్తారు.

ఏ ట్రైలర్ టిజర్ ఆసక్తి దానికి ఉంటుంది. దాదాపు ఒకదానికి మరోటి పోలికలేకుండా కట్ చేస్తారు చిత్ర యూనిట్ సభ్యులు. కాని ఇక్కడ ఆవిరి లో అంత రివర్స్. ఈ మూడు టీజర్లలో స్వల్పమైన మార్పులు మాత్రమేవుంటాయి. అదీ విపరీతమైన పరిశీలనా శక్తి.. టీజర్లను రిపీట్ మోడ్ లో చూసే ఆసక్తి.. అన్ని టీజర్లను వరసగా చూసి వాటిలో తేడాలు కనిపెట్టే సహనం.. ఓర్పు ఉంటే తప్ప కనిపెట్టలేం. మొదటి టీజర్ లో మనకు కనిపించని ఒక ఆత్మ జ్యూన్ ను ఒక గ్లాస్ లోకి ఒంపుకుంటుంది. రెండో టీజర్ లో ఆ ఆత్మ చిన్న పిల్లల స్కేటింగ్ స్కూటర్ ను నడుపుతుంది. ఇక మూడవ టీజర్లో ఒక పింక్ కలర్ ట్రావెల్ బ్యాగ్ హ్యాండిల్ ను బయటకు లాగి బ్యాగును తోసుకెళ్తుంది. అవే ఆ తేడాలు.. ఇక మిగతా అంతా దాదాపుగా సేమ్ టు సేమ్. ఈ టీజర్ లో భయం గొలిపే అంశం మచ్చుకైనా కనిపించదు. బ్యాక్ గ్రౌండ్ స్కోరు కూడా చాలా వీక్. వీటికి తోడు ‘మీరు ఆత్మను కనిపెట్టండి’ అని పజిల్ లాంటి క్యాప్షన్ ఒకటి! ఒక్క ముక్కలో చెప్తే ఈ టీజర్ సినిమా స్థాయిలో లేదు.. పైగా ఈ వరస టీజర్ల దండయాత్ర నెటిజన్లకు చిరాకు తెప్పిస్తోంది. అందుకే ఈ టీజర్ కింద కామెంట్స్ సెక్షన్లో నెటిజన్లు ఫ్రస్ట్రేషన్లో పదుల సంఖ్యలో జోకులు రాసి పెట్టారు.

Share.

Comments are closed.

%d bloggers like this: