తెలంగాణ చేగువీరా.. జార్జ్ రెడ్డి బయోపిక్..! అప్డేట్స్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆయనో ఉద్యమకారుడు..! విద్యార్థి నాయకుడు..! విద్యార్థులకు ఏ కష్టం వచ్చినా నేనున్నా అంటూ ముందుకొచ్చేవాడు.. తామంతా ఒక తల్లి బిడ్డలము అని భావించి అందరి కష్టాలకు ఈయనే తన గలాన్ని వినిపించేవాడు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఉస్మానియా యూనివర్సిటికీ వచ్చాడు. విద్యార్థి నేతగా ఎదిగాడు..కార్ల్ మార్క్స్ నినాదాలు ఆదర్శంగా భావించి ఉద్యమాలు చేశాడు.. తెలంగాణ చేగువీరా గా గుర్తింపు పొందాడు… ఆయనే జార్జ్ రెడ్డి..! కుల్లు రాజకీయాలకి బలైపోయాడు.. 25 ఏళ్లకే హత్యకి గురయ్యాడు.. విద్యార్థి నేతగా ఎదిగి విద్యార్థి నేతగానే ప్రాణాలు విడిచాడు. దాదాపుగా 30 మందికి పైగా దుండగులు యూనివర్సిటీలోకి జొరబడి 60 పాట్లు పొడిచి దారుణంగా చంపేశారు.. ఈ ఘటన కి యూనివర్సిటీ దద్దరిల్లింది.. చదువుల తల్లి బాధ పడింది.

‘దళం’ సినిమా దర్శకుడు జీవన్ రెడ్డి చెప్పిన ఈయన కథ కి ఫిదా అయిన వ్యాపారవేత్త మైక్ టీవీ అధినేత అప్పిరెడ్డి ఆయన కథను ఎలాగైనా చూపించాలని సినిమా తీయాలని ఫిక్స్ అయ్యాడు. బయోపిక్ కి సమర శంఖం పూరించాడు.  క్రిటిక్స్ ని సైతం తన నటన తో మెప్పించిన రీల్ వంటగవీటి.. హీరో సందీప్ సాండీ ని జార్జ్ రెడ్డి గా చూపించనున్నారు..  ‘సైరత్’ మూవీకి కెమెరామెన్ గా పనిచేసిన సుధాకర్ ఎక్కంటి ఈ చిత్రానికి  డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా పని చేస్తున్నాడు. సహ నిర్మాతలుగా దాము రెడ్డి, కొస్నం, సుధాకర్ పని చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన కొన్ని ఫోటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.. రియల్ జార్జ్ రెడ్డి ని పోలినట్టుగా ఉన్నాడు సాండీ. సాండీ అచ్చు దిద్దినట్టుగా ఉండటం ఈ సినిమాకి ప్లస్ పాయింట్. ఈ ఫోటోలు వైరల్ అవడంతో వైరల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా తన ఇన్స్టాగ్రామ్ లో పోస్టర్ ను పోస్ట్ చేశాడు.

సినిమా తెరకెక్కించడం దాదాపుగా పూర్తయ్యింది. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతునట్టు టాక్ వినిపిస్తుంది.. చిత్ర బృందం తాజాగా సినిమా టీజర్ ను దసరా పండుగ సందర్భంగా రిలీజ్ చేస్తునట్టుగా పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ కు సోషల్ మీడియా లో భారీగా స్పందన కూడా వస్తుంది. సినిమాకి మార్కెట్ లో మంచి బిజ్ అయితే వినపడుతుంది.. మరి సినిమా ఎలా ఉండబోతుంది.. ఎలా చూపించబోతున్నారు.. సినిమా లో పాత్రలకి నటులు ఏ రేంజ్ లో సెట్ అయ్యారు.. మరిన్ని వివరాలు తెలియాలంటే తీజర్ విడుదల అయ్యేంతవరకు వెయిట్ చేయాలి. సినిమా టీజర్ సినిమాకు కొండంత బలాన్ని ఇవ్వాలని సినిమాకి మంచి హిట్ దక్కాలని కోరుకుంటుంది మహా న్యూస్.

Share.

Comments are closed.

%d bloggers like this: