Advertisements

ఇది కేసా ..? కుట్రా..? వైస్ ఛాన్స్ లర్ దామోదర్ అరెస్ట్ వెనుక ఉన్న నిజాలు..

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆయన ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి వైస్‌ ఛాన్స్‌లర్‌.. ముక్కు సూటి మనిషిగా వర్సిటీ సీతయ్యగా గుర్తింపు ఉన్న మనిషి. ఆయనే వల్లభనేని దామోదరనాయుడు. కానీ ఈయన ముక్కు సూటితనం దెబ్బ తీసిందో.. పద జాలం దెబ్బ తీసిందో కానీ ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఈయన పై భరాయించిన కేసు నిర్ధారణ అవ్వడంతో ఈ నెల 30 వరకు ఈయనకి కోర్టు రిమాండ్ విధించింది. తన వద్ద అటెండర్ గా పనిచేసే వ్యక్తిని వీసీ ధూషించారని మధ్యలో కులాన్ని తీసుకొచ్చారని తనతో పాటు తన కులాన్ని కూడా ధూషించినట్టు ఆ ఉద్యోగి కేసు పెట్టాడు. ఇక ఎస్సీ ఎస్టీ అత్రాసిటీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.. విచారణలో కూడా ఇదే తేలడంతో ఆయనను తన నివాసం లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఈ ఎస్సీ ఎస్టీ కేసు వీసీ మెడ మీదకి కత్తిలా వచ్చిపడింది. ఈ విషయం ఇలా ఉంటే యూనివర్సిటీ వాళ్ళు మాత్రం ఇది అవాస్తవం అని ఆయన అలాంటి వ్యక్తి కాదని కొట్టిపారేస్తున్నారు కేవలం రాజకీయ కారణాల వల్లే ఇలా జరిగిందని వాళ్ళు విస్మయాన్ని తెలియజేస్తున్నారు.

వివరాల్లోకి వెళితే.. చిలకలూరిపేటకు చెందిన ఉయ్యాల మురళీకృష్ణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి. వీసీ వద్ద అటెండర్‌గా పని చేసేవారు. విధులకు సరిగా రాకపోవడంతో ఆరు నెలల క్రితం విధుల నుంచి తప్పించారు. అప్పటి నుంచి మురళీకృష్ణ తనను ఉద్యోగంలోకి తీసుకోవాలని వీసీ చుట్టూ తిరుగుతున్నారు. దీనిలో భాగంగా గత నెల 23న దామోదరనాయుడు సచివాలయానికి వస్తున్నారని తెలుసుకుని అక్కడ ఆయన్ను కలిశారు. తనను ఉద్యోగంలోకి తీసుకోవాలని కోరారు. అయితే దామోదరనాయుడు సచివాలయంలో తన పట్ల అమర్యాదకరంగా మాట్లాడారని.. ఎక్కడకుపడితే అక్కడకు వచ్చి అడగడమేనా అంటూ కులం పేరుతో తనను దూషించారని మురళీకృష్ణ గతనెల 23న తుళ్లూరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

వర్సిటీలో విస్మయం :

దీంతో దామోదరనాయుడిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసును డీఎస్పీ స్థాయి అధికారి విచారించాల్సి ఉండడంతో డీఎస్పీ శ్రీనివాసరెడ్డి కేసును దర్యాప్తు చేశారు. కులం పేరుతో మురళీకృష్ణను వీసీ దూషించడం వాస్తవమేనని నిర్ధారించి.. ఆదివారం గుంటూరులో వీసీ దామోదరనాయుడిని ఆయన ఇంట్లో అరెస్టు చేశారు. అక్కడి నుంచి తుళ్లూరు పోలీసు స్టేషన్‌కు తరలించారు. అనంతరం మంగళగిరి కోర్టులో హాజరుపరచగా కోర్టు ఈ నెల 30 వరకు రిమాండ్‌ విధించింది. దీంతో దామోదర్‌నాయుడిని జైలుకు తరలించారు. వర్సిటీ అధికారులు మాత్రం దీని వెనుక తప్పకుండా రాజకీయ కుట్ర ఉందని అందుకే ఈ కేసు అని అంటున్నారు.
వీసీ దామోదరనాయుడు అరెస్టు వర్సిటీ వర్గాల్లో విస్మయం కలిగించింది. వర్సిటీలో సీతయ్యగా పేరున్న వీసీని అవుట్‌ సోర్సింగ్‌ పోస్టులో పని చేసి, క్రమశిక్షణ చర్యలకు గురైన వ్యక్తి చేసిన ఫిర్యాదుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్టు కింద కేసు నమోదు చేయడం.. ఇప్పుడు అరెస్టు చేయడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని భావిస్తున్నాయి. వర్సిటీ పాలనను గాడిలో పెట్టేందుకు కఠిన నిర్ణయాలు తీసుకున్న దామోదరనాయుడు ముక్కుసూటిగా వ్యవహరించే క్రమంలో ఆయన విమర్శలకు గురయ్యారు. కొందరు ఉద్యోగులు దీర్ఘకాలంగా ఒకే చోట ఉండడం, మరికొందరు నిధుల దుర్వినియోగానికి పాల్పడడం వంటి కారణాలతో వీసీ సదరు ఉద్యోగులను బదిలీ చేయడం, జరిమానాలు విధించడంతో ఆయనపై వ్యతిరేకత వచ్చింది.

ఇదే క్రమంలో అనంతపురం జిల్లాకు చెందిన శాస్త్రవేత్త నేతృత్వంలో కొందరు బోధన, బోధనేతర ఉద్యోగులు ప్రభుత్వానికి ఫిర్యాదులు చేశారు. వాటిపై ప్రస్తుత ప్రభుత్వం మార్కెటింగ్‌ కమిషనర్‌ ప్రద్యుమ్నతో గత నెలలో విచారణ చేయించింది. అయితే ఆ ఆరోపణలన్నీ వీసీ వైఖరి నచ్చక చేసినవేనని విచారణలో నిర్ధారణైంది. దాంతో ఉద్యోగులు నేరుగా రాష్ట్ర గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఆయన విచారణకు ఆదేశించారు. ఇంటెలిజెన్స్‌, ఇతర విచారణ నివేదికల ఆధారంగా వీసీపై చర్యలకు ప్రభుత్వం న్యాయ నిపుణుల సలహాలు కోరింది. కానీ ఈలోగా ఒక మాజీ ఉద్యోగి చేసిన ఫిర్యాదుపై.. ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి హోదా కలిగిన వీసీని ఎస్సీ ఎస్టీ చట్టం కింద అరెస్టు చేయడం వర్సిటీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.

Advertisements
Share.

Comments are closed.

%d bloggers like this: