స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం అల వైకుంఠపురములో. త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీకి జోడిగా పూజా హెగ్డే నటిస్తోంది. చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ రెండు పాటలను రిలీజ్ చేసింది. తొలి పాట సామజవరగమన ఇప్పటికీ టాలీవుడ్ లో టాప్ ట్రెండ్ అవుతుండగా, లేటెస్ట్ సెన్సేషన్ రాములో రాములా అయితే యూట్యూబ్ రికార్డ్లను బ్రేక్ చేస్తోంది. ఏకంగా ఆల్ టైం సౌత్ ఇండియా రికార్డ్స్ వైపు పరుగులు పెడుతుంది అల వైకుంఠపురములో.
దీపావళి పర్వదినాన పదుల సంఖ్యలో సినిమా ట్రైలర్స్, పోస్టర్స్, సాంగ్స్ విడుదలైనా, బన్నీ ఒక్కడే టాక్ ఆఫ్ ధీ టౌన్ గా నిలిచాడు. ఇప్పటికే సామజ వరాగమనా ట్రేండింగ్ లో ఉండగానే, యూట్యూబ్ పై మరోసారి దండెత్తాడు బన్నీ. ‘ రాములో రాముల ‘ అనే పార్టీ సాంగ్ ఇప్పుడు సౌత్ నే షేక్ చేసేస్తుంది. శనివారం విడుదల చేసిన ఈ పాట 24 గంటల్లో 8.3 మిలియన్ల అనగా 83 లక్షల వ్యూస్ సాధించి రికార్డ్ సృష్టించింది. లైక్స్ విషయంలోనూ రాములో రాములా రికార్డ్ల మీద రికార్డ్‌లు సృష్టిస్తోంది. ఈ పాటకు ఇప్పటి వరకు 3లక్షల 40 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. సౌత్‌లో 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన పాటగా రికార్డ్ సృష్టించింది రాములో రాములా. సౌత్ సూపర్ స్టార్స్ రజినీకాంత్, విజయ్, మహేష్ బాబు, ప్రభాస్ లకు కూడా సాధ్యమవ్వని రికార్డ్స్ క్రియేట్ చేసి లేటెస్ట్ సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ గా దూసుకెళ్తున్నారు బన్నీ. మాస్ బీట్‌లో తమన్ కంపోజ్ చేసిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి, సత్యవతి అలియాస్ మంగ్లీ అలపించారు. కాశర్ల శ్యామ్ సాహిత్యమందించారు. ఈ పాటను కలర్ఫ ల్ ఫ్యామిలీ పార్టీ సాంగ్‌గా చిత్రీకరించారు త్రివిక్రమ్. బన్నీ లుక్, స్టె్ప్స్ పాటకు మరింత అందం తీసుకువచ్చాయి. ఈ పాటలో బన్నీతో పాటు పూజా హెగ్డే, సుశాంత్, నివేదా పేతురాజ్, టబు, జయరామ్‌లు కూడా ఆడిపాడారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాను గీతాఆర్ట్స్, హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్లపై అల్లు అరవింద్, రాధకృష్ణ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.