ఇప్పుడున్న కమర్షియల్ పాలిటిక్స్ లో ఇమడలేక ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్నాడు పవన్ కళ్యాణ్. ప్రత్యర్థులకు ధీటుగా డబ్బులు పంచలేక, సత్త ఉన్నా కానీ చతికిలపడ్డ జనసేనను ఎలాగైనా గాడిలో పెట్టాలని పవన్ షాకింగ్ డెసిషన్ కి వచ్చాడు. ప్రస్తుతం పబ్లిక్ మీటింగ్ పెట్టడానికి కూడా సరైన ఫండ్స్ లేని జనసేన కోసం మల్లి సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలని పవన్ సీరియస్ గా ఆలోచిస్తున్నాడు.. సినిమాల ద్వారా సంపాదించి పార్టీని కాపాడుకోవాలని పవన్ భావిస్తున్నాడు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధం అవుతోంది. మరో రెండు వారాల్లోనే సినిమా లాంచ్ జరగనుంది. ఈ సినిమాకి క్రిష్ దర్శకత్వం వహించనున్నారు. పవన్ సినిమా అంటే ట్రేడ్ వర్గాల్లో డిమాండ్ భారీ స్థాయిలో ఉంటుంది.. అందులోనూ రీఎంట్రీ సినిమాపై మరింతగా ఆసక్తి ఉంటుంది. ఆ డిమాండ్ కు తగ్గట్టే సినిమాకు పవన్ భారీ రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తున్నారట. సీనియర్ ప్రొడ్యూసర్ ఎఎం రత్నం ఈ సినిమాను నిర్మిస్తున్నారని.. పవన్ డైరెక్ట్ గా రెమ్యూనరేషన్ తీసుకోకుండా సినిమాకు జరిగే బిజినెస్ నుండి షేర్ తీసుకుంటారని సమాచారం. ఆ షేర్ ఎమౌంట్ రఫ్ గా అంచనా వేస్తే దాదాపు రూ.50 కోట్లకు పైచిలుకే ఉంటుందని అంటున్నారు. ఈ సినిమా ప్రొడక్షన్ పార్టనర్ గా పవన్ కళ్యాణ్ బ్యానర్ పేరు ఉంటుందట. ఈమధ్య పెద్ద స్టార్ హీరోలు కొందరు ఇదేరకంగా తమ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ కూడా అదే రూట్ ఫాలో అవుతున్నారట. పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాలు చేసే నిర్ణయం తీసుకోవడం.. భారీ రెమ్యూనరేషన్ తీసుకునేందుకు కారణం జనసేన పార్టీని నడిపేందుకు ఫండ్స్ సమకూర్చుకోవడం కోసమేనని కొందరు అంటున్నారు. ఏదేమైనా పవన్ రీఎంట్రీ సినిమా అభిమానుల్లో ఫుల్ జోష్ ను తీసుకొచ్చింది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడవుతాయి.