వారి బెదిరింపు కాల్స్ తోనే వర్మ వెనక్కి తగ్గాడా…!

Google+ Pinterest LinkedIn Tumblr +

బయానికే మీనింగ్ తెలియని బ్లడ్ అనే డైలాగ్ వర్మకు సూట్ అయ్యేంత మరెవ్వరికి సూట్ అవ్వదేమో. మాఫియా, టెర్రరిస్ట్, పొలిటిషియన్స్, ఇలా ఎంతటి బడా వ్యక్తినైనా విమర్శించే వర్మ తొలిసారి బయపడ్డడా అంటే అవుననే వార్తలే వస్తున్నాయి. మెగా క్యాంప్ పై సినిమా తీయాలనుకున్న వర్మ వెనక్కితిరగడం వెనక ఒక వార్నింగ్ కాల్ ఉందట. ఆ కాల్ తరువాత గత్యంతరం లేక వర్మ సైలెంట్ అయ్యాడట..!

సంచలనాలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన తదుపరి చిత్రం ‘మెగా ఫ్యామిలీ’ అనే టైటిల్‌తో ఉండబోతుందని సోమవారం ప్రకటించాడు. దీంతో ఎప్పటిలాగే వర్మ ఏదో సంచలనానికి సిద్ధమయ్యాడనుకొన్న నెటిజన్లు.. ఏం చెప్తాడోనని ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే ఇదంతా తూచ్ అని చెప్పేసిన వర్మ.. తాను ఈ మూవీని చేయాలనుకోవడం లేదంటూ అందరికీ షాక్‌ ఇచ్చాడు. అంతేకాదు దానికి ఓ నిర్వచనం కూడా ఇచ్చాడు. మెగా ఫ్యామిలీ అనే చిత్రం ఒక వ్యక్తి, అతడికి చెందిన 39మంది సంతానంకు సంబంధించినది. ఇందులో చాలా మంది పిల్లలు ఉన్నారు. కానీ నేను చిన్న పిల్లల చిత్రాలను తీయలేను. అందుకే ఈ సినిమాను తీయడం లేదు’’ అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో నెటిజన్లు అందరూ ఉఫ్‌ అనుకున్నారు. అయితే సోమవారం మెగా ఫ్యామిలీ అనే టైటిల్‌ను వర్మ ప్రకటించగానే.. మెగా ఫ్యాన్స్ నుంచి నెగిటివిటీ పెరిగింది.

సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్, వర్మను దారుణంగా ట్రోల్ చేశారు. అంతేకాదు మెగా క్యాంప్ కి సప్పోర్ట్ చేసే ఒక పవర్ ఫుల్ పొలిటీషియన్ వర్మకు కాల్ చేసి హెచ్చరించాడని కూడా మరో వార్త ఉంది. తెలంగాణాలో వర్మ పై ఉన్న పోర్న్ సినిమా కేసు అప్పట్లో ముందుకు కదలక పోవడానికి కూడా ఇదే పొలిటీషియన్ కారణమట. అందుకే వర్మ మెగా ఫ్యామిలీ సినిమా నుండి వెనక్కి తగ్గాడని ఇండస్ట్రి టాక్. అయితే ఇప్పటివరకు వర్మ ఎన్నో సంచలనాత్మక సినిమాలు తీయగా.. వాటిపై పెద్ద పెద్ద వివాదాలే జరిగాయి. కానీ ఎన్ని వివాదాలు వచ్చినా.. ఎన్ని బెదిరింపులు వచ్చినా.. వర్మ అంత ఈజీగా వెనక్కి తగ్గడు. అలాంటిది వర్మకే ఇలాంటి కర్మ రావటం ఆయన ఫాన్స్ ని అవక్కయ్యేలా చేస్తుంది.

Share.

Comments are closed.

%d bloggers like this: