మెగా స్టార్ బిత్తిరి వార్తలపై సత్తి స్పందన కరెక్టేనా…?

Google+ Pinterest LinkedIn Tumblr +

న్యూస్ ఛానెల్స్‌లో వచ్చే యాంకర్లలో బిత్తిరి సత్తిది డిఫరెంట్ స్టైల్. తన ‘తీన్మార్ వార్తలు’తో రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ అయిన బిత్తిరి సత్తికి ఇప్పటివరకు ఉన్న ఫాలోయింగ్ వేరు బిగ్ బాస్ ఫైనల్ తరువాత వచ్చిన ఇమేజి వేరు. ఏకంగా మెగా స్టార్ చిరంజీవే బిత్తిరి సత్తిని ఇమిటేట్ చేయటం బిగ్ బాస్ ఫైనల్లో ఒక హైలైట్. అయితే కోటానుకోట్ల అభిమానుల ఆరాధ్య దైవమైన చిరంజీవి తనని ఇమిటేట్ చెయ్తటంపై బిత్తిరి సత్తి స్పందన ఏంటి, మెగా స్టార్ బిత్తిరి ని ఇమిటేట్ చేయడానికి గల కారణాలేంటి ..?
ఆదివారం రాత్రి బిగ్ బాస్ సీజన్ 3 గ్రాండ్ ఫినాలేకి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ ఈవెంట్లో చిరంజీవి బిత్తిరి సత్తిని ఇమిటేట్ చేస్తూ శివ జ్యోతితో మాట్లాడిన తీరు బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలికే హైలైట్ అని చెప్పొచ్చు. హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను తానే స్వయంగా పరిచయం చేసుకుంటూన్న తరుణంలో శివజ్యోతి దగ్గరకు వచ్చేసరికి చిరంజీవిని బిత్తిరి సత్తి ఆవహించారు. ఆయన స్టైల్లో చేతి వేళ్లు వంకరగా పెట్టి.. ‘ఫ’ భాషలో మాట్లాడుతూ నవ్వించారు చిరంజీవి. తెలంగాణ మొత్తానికి జ్యోతక్క’’ అంటూ చిరంజీవికి శివజ్యోతిని నాగార్జున పరిచయం చేశారు.

‘‘హాయ్ సార్.. బాగున్నారా’’ అని చిరంజీవిని శివజ్యోతి అడగగానే.. ‘‘సాలా బాగున్నాననమ్మా.. సాలా హ్యాఫీగా ఉందమ్మ నిన్ను ఈవాళ కలవటం. ఎంత హ్యాఫీ అంటే ఫప్ఫన్నం తిన్నట్టుంది ఈవాళ’’ అని చిరంజీవి బిత్తిరి సత్తిలా మాట్లాడారు. ఈ సమయంలో అక్కడంతా అరుపులు, కేకలు వేసినా కాని తనని ఇమిటేట్ చేసిన బిత్తిరి సత్తి మాత్రం ఇంకా అఫీషియల్గా స్పందించలేదు. మెగా స్టార్ లాంటి వాడే తనని ఇమిటేట్ చేయటం నా జీవితంలో మరిచిపోలిని అనుభూతని బిత్తిరి సత్తి ఆఫ్ లైన్ కామెంట్స్ అట. ట్యాలెంట్ ఎక్కడ ఉన్న , చిరంజీవి గారు ఎంకరేజ్ చేస్తారని అందరు అంటారు.., నాలాంటి చిన్న కళాకారుడిని కూడా చిరంజీవి గారు ఫాలో అవుతూ నన్ను ఎంకరేజ్ చేయటం ఆయన మంచితనానికి నిదర్శనమని బిత్తిరి ఆఫ్ లైన్ లో కామెంట్స్ చేసినా మీడియా ముందుకు వచ్చి చెప్తే గౌరవంగా ఉంటుంది కదా అని మెగా ఫ్యాన్స్ అంటున్న మాట. అయితే తన ప్రతిష్టాత్మక చిత్రం తుపాకీ రాముడు అంతగా రాణించక పోవటంతో బిత్తిరి మీడియాకు మొహం చాటే స్తున్నాడని కొందరి వాదన .

Share.

Comments are closed.

%d bloggers like this: