పవన్ ముందు బాలీవుడ్ హీరోలు వెస్ట్ అంటున్న బోనీ కపూర్..?

Google+ Pinterest LinkedIn Tumblr +

పవన్ కళ్యాణ్‌తో కలిసి నిర్మాత బోనీ కపూర్ పింక్ సినిమాను రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే. హిందీలో అమితాబ్ బచ్చన్ , తమిళ్లో అజిత్ చేసిన ఈ సినిమాని తెలుగులో పవన్ తోనే తీయాలని పట్టుబట్టి మరి పవన్ని ఒప్పించారు బోణి అండ్ దిల్ రాజు. టాలీవుడ్ లో సినిమాలు ఆపేసి రాజకీయాల్లోనే ఉంటాను అన్న పవన్ నిర్ణయం మార్చుకునేంత మ్యాజిక్ ఎం జరిగింది , పింక్ రీమేక్ మీరే చెయ్యాలని పవన్ పైనే బోణి ఎందుకు ఫోకస్ పెట్టారు.., అసలు పవన్ కళ్యాణ్ తోనే బోణి ఈ చిత్రం చేయాలనీ ఎందుకు పట్టు బట్టారు..,
మొత్తానికి పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఓ సెన్సేషనల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘అజ్ఞాతవాసి’ సినిమా తర్వాత పవన్ పూర్తిగా సినిమాలకు దూరం అయిపోతారు అనుకున్నారంతా. కానీ ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ దేవుడిలా వచ్చి మొత్తానికి పవన్‌ చేత సినిమాను మొదలుపెట్టించబోతున్నారు. అయితే ఈ సినిమాను పవన్‌తోనే ఎందుకు చేయాలనుకుంటున్నారో తాజాగా బోనీ కపూర్ మీడియా ద్వారా వెల్లడించారు. బాలీవుడ్‌ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నటించిన సినిమా ‘పింక్’. ఇది చాలా మంది విజయం అందుకుంది. తమిళ నటుడు అజిత్‌తో కలిసి ఏదన్నా సినిమా చేయాలన్నది నా భార్య శ్రీదేవి కల. ఆ కల నెరవేర్చడం కోసం నేను పింక్‌ను తమిళంలో ‘నేర్కొండ పార్వాయ్’ టైటిల్‌తో రీమేక్ చేశాను. ఈ వెర్షన్ కూడా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఆ తర్వాత తెలుగులో తీసినా అంతే విజయం సాధిస్తుందన్న నమ్మకం ఏర్పడింది. అందుకే ఈ సినిమాను తెలుగులో తీయాలని నిర్ణయించుకున్నాను. తెలుగు ప్రేక్షకులను నచ్చే అంశాలతోనే సినిమాను తీస్తాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఈ సినిమా చేస్తే బాగుంటుంది అనిపించింది. అందుకే ఆయన్ను ఒప్పించాను’ అని వెల్లడించారు. పవన్ రేంజికి ఈ సినిమా ఏ మాత్రం తీసిపోనిదని, పవన్ లాంటి హీరోని నేను బాలీవుడ్ లో కూడా చూడలేదని పవన్ పై ప్రశంసలు కురిపించాడు బోనికపూర్.

Share.

Comments are closed.

%d bloggers like this: