నాకు క్యారెక్టర్ ఉంది, అనసూయాలా నేనది చేయలేనంటున్న రాశి…!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఇప్పుడున్న కమర్షియల్ మార్కెట్లో హీరోయిన్స్ తాము కేవలం నటనతోనే మెప్పిస్తామంటే కుదరదు. ఎట్టి పరిస్థితుల్లో గ్లామర్ షో చెయ్యాల్సిందే. లేకపోతే ఆ అవకాశన్నీ క్షణాల్లో ఎగిరేసుకుపోడానికి ఎంతోమంది రెడీగా ఉంటారు. సీనియర్ హీరోయిన్ రాశికి కూడా ఇప్పుడలాంటి పరిస్థితే ఎదురైది. ఏకంగా రాంచరణ్ సినిమాలో ఛాన్స్ వస్తే, ఎక్స్ పోజింగ్ చేయాల్సి వస్తుందని, ఆ పాత్రను రాశి వదులుకోగా, మరో హాట్ బ్యూటీ ఆ క్యారెక్టర్ చేసి శభాష్ అనిపించుకుంది. ఇంతకీ ఆ పాత్ర ఏమిటి, అది చేసిన ఆ హాట్ బ్యూటీ ఎవరు.

అయితే లేటెస్ట్ గా ఆలితో జాలిగా అనే షో కి అందాల రాశి గెస్టుగా వచ్చింది. మంచి రసవత్తరమైన ప్రశ్నలు, ఏమోషనల్ కంటెంట్ తో సాగిపోయ్యే ఈ షోలో సీనియర్ హీరోయిన్ రాశి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింద. ముఖ్యంగా రాంచరణ్ బ్లాక్ బస్టర్ రంగస్థలంలో తనకు వచ్చిన ఆఫర్ ఎలా మిస్ అయ్యింది, ఎందుకు మిస్ అయ్యిందో చెప్పి అందర్నీ షాక్ కి గురిచేసింది. ఈ సినిమాలో రంగమ్మత్త పాత్ర కోసం ముందుగా రాశిను సంప్రదించాడట సుక్కు. అయితే గ్లామర్ షో కి స్కోప్ ఉండే పాత్ర కావడంతో రాశీ ఆ పాత్రను నిర్మొహమాటంగా తిరస్కరించేసిందట. మోకాలి వరకు చీరను వేసుకునే పాత్ర అవ్వటంతో రాశి ఎక్స్ పోజింగ్ కి ససేమీరా ఆనిందట. కానీ సుకుమార్ ఆ పాత్రని అలానే చూపించాలని డిసైడ్ అవ్వటంతో ఆ పాత్రకి హాట్ అనసూయను క్యాస్టింగ్ చేసాడట. టివీల్లోనే చిట్టి పొట్టి బట్టలతో గ్లామర్ డోర్లు తీసే అనసూయ రంగమ్మత్త పాత్రకి ఎక్స్ పోజింగ్ చేయటం చాలా చిన్న విషయం. అందుకే వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా అనసూయ రంగమత్తపాత్రని చేసేసింది. అయితే ఈ విషయాన్ని స్వయంగా చెప్పుకుంది రాశి. సో అలా రాశి వదులుకున్న పాత్రను అనసూయ చేయడం ఆ పాత్రతో మరింత పాపులారిటీ సంపాదించుకోవడం జరిగింది. అయితే ఇంటర్వ్యూ లో పవన్ కళ్యాణ్ ‘గోకులంలో సీత’ సినిమాలో అవకాశం వచ్చింది చిరంజీవి సతీమణి సురేఖ గారి వల్లే అంటూ తెలిపింది రాశి. ఆ సినిమా కోసం ప్రత్యేకంగా కబురు పంపి మరీ కళ్యాణ్ పక్కన నువ్వైతే బాగుంటావ్ సీత పాత్రకి నువు పర్ఫెక్ట్ అని చెప్పి ఒప్పించారట. ఇలా తనకు మాత్రమే తెలిసిన కొన్ని సంగతులను బయట పెట్టింది ఈ సీనియర్ హీరోయిన్

Share.

Comments are closed.

%d bloggers like this: